3 గంటలు.. 10 లక్షల లైక్స్.. అయ్యబాబోయ్ సమంత ఏంటిది..!
TeluguStop.com
సౌత్ స్టార్ హీరోయిన్ అక్కినేని కోడలు సమంత ఏం చేసినా అదో అద్భుతమని చెప్పాలి.
సమంత ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ కు చాలా స్పెషల్.ఆమె జస్ట్ అలా ఒక పిక్ తీసి పెడితే చాలు దాన్ని కూడా వైరల్ చేసేస్తారు.
తరచు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత తన ప్రతి అప్డేట్ తో ఫ్యాన్స్ ను అలరిస్తుంది.
అందుకే ఆమెకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కూడా భారీగా ఉంటారు.లేటెస్ట్ గా సమంత తన ఇన్ స్టాగ్రాం లో ఒక పిక్ షేర్ చేసింది.
సరదాగా షేర్ చేసిన ఆ పిక్ కు 3 గంటల్లో 1 మిలియన్ పైగా లైక్స్ వచ్చాయి.
ఇది చాలదు సమంత క్రేజ్ గురించి చెప్పడానికి.మాములుగా అయితే పెళ్లైన హీరోయిన్ కు క్రేజ్ తగ్గిపోతుంది కాని సమంతకు రోజు రోజుకి క్రేజ్ డబుల్ అవుతుంది.
ఇన్ స్టాగ్రాం లో సమంతకు 18 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.ఇక సినిమాల విషయానికి వస్తే సమంత ప్రస్తుతం గుణశేఖర్ డైరక్షన్ లో శాకుంతలం సినిమా చేస్తుంది.
ఈ సినిమాలో టైటిల్ రోల్ లో సమంత తన అద్భుత నటనతో ఆకట్టుకుంటుందని అంటున్నారు.
సమంత చేస్తున్న మొదటి మైథలాజికల్ మూవీ ఇది.అంతేకాదు సమంత చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కూడా ఇదే అవడంతో సినిమా మీద సమంత కూడా చాలా హోప్స్ పెట్టుకుంది.
రక్తహీనత వేధిస్తుందా.. నీరసంగా ఉంటుందా.. అయితే ఈ జ్యూస్ మీకే!