సమంత పెప్సీ యాడ్ పై విమర్శలు..!
TeluguStop.com
శాకుంతలం( Sakunthalam ) రిజల్ట్ తేడా కొట్టేయడంతో కొద్దిగా డీలా పడ్డ సమంత( Samantha ) ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలో నటిస్తుంది.
ఈ సినిమా తో పాటుగా బాలీవుడ్ వెబ్ సీరీస్ లో నటిస్తుంది సమంత.
లేటెస్ట్ గా కూల్ డ్రింక్ యాడ్ చేసింది అమ్మడు.ప్రముఖ శీతల పానీయం పెప్సీ యాడ్ చేసి సమంత ఫ్యాన్స్ ని ఖుషి చేసింది.
అదేంటో విజయ్ దేవరకొండ థంస్ అప్ కి యాడ్ ఇస్తుంటే అతని సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సమంత పెప్సీకి బ్రాండింగ్ చేస్తుంది.
అయితే సమంత పెప్సీ( Pepsi ) యాడ్ పై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.
సమంత ఈమధ్యనే మయోసైటిస్ నుంచి కోలుకుంది.యాడ్ ఇవ్వడంతోనే సమంత ఆ శీతల పానియం తాగేస్తుందని కాదు కానీ ఆమె యాడ్ ఇవ్వడం వల్ల ఆమె ఫ్యాన్స్ దాన్ని తాగే అవకాశం ఉంది.
అలా వారికి అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది.దీనిపై నెటిజన్లు నీ ఆరోగ్యం బాగుండాలి కానీ ఇతరుల గురించి ఆలోచించే పని లేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఖుషి సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ ఫిక్స్ చేశారు.ఆ సినిమాతో సమంత హిట్ ఫాం లోకి రావాలని చూస్తుంది.
రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీయార్ వీళ్లలో టాప్ హీరో అతనేనా..?