యూట్యూబ్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సమంత ఊ అంటావా మావ సాంగ్!

సినీనటి సమంత( Samantha ) ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించడమే కాకుండా ఇటీవల ఓ స్పెషల్ సాంగ్ ద్వారా కూడా ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేసిన సంగతి మనకు తెలిసిందే నటుడు అల్లు అర్జున్( Allu Arjun )సుకుమార్ డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం పుష్ప ( Pushpa ) ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటించినప్పటికీ సమంత మాత్రం స్పెషల్ సాంగ్ చేశారు.

ఈ సినిమాలో ఊ అంటావా మామ అంటూ సమంత రెచ్చిపోయి మరి డాన్స్ చేశారు.

"""/" / ఇక ఈ పాట అప్పట్లో భారీ స్థాయిలో మారుమోగి పోవడమే కాకుండా ఎంతోమంది ఈ పాటకు అద్భుతమైనటువంటి డాన్స్ చేస్తూ రీల్స్ చేశారు ఇప్పటికీ ఈ పాట ఎక్కడైనా వినిపించిన అందరూ ఊగిపోతూ ఉంటారనే చెప్పాలి.

అప్పట్లో ఈ పాట సోషల్ మీడియాని షేక్ చేసిందని చెప్పాలి.ఇకపోతే సోషల్ మీడియాలో ఈ పాట వైరల్ గా మారడంతో అతి తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంది.

ఈ పాటకు రిలీజైన 68 రోజుల్లోనే యూట్యూబ్లో 20 కోట్లకుపైగా వ్యూస్ వచ్చాయి.

యూట్యూబ్లో ఇంత తక్కువ టైంలో అత్యధిక వ్యూస్ సాధించిన పాటగా సరికొత్త రికార్డు సృష్టించింది.

"""/" / ఇకపోతే అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో నటించిన అలా వైకుంఠపురం సినిమాలోని బుట్ట బొమ్మ అనే సాంగ్ కూడా 20 కోట్ల వ్యూస్ రాబట్టాయి కానీ ఇంత వ్యూస్ రావడానికి ఏకంగా 95 రోజుల సమయం పట్టింది ఇటీవల త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాలోని కూర్చి మడత పెట్టే( Kurchi Madathapetti ) సాంగ్ కూడా అదే స్థాయిలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ పాట 20 కోట్ల వ్యూస్ రావడానికి ఏకంగా 78 రోజులు పట్టింది ఇలా వీటన్నింటి కంటే అతి తక్కువ సమయంలోనే పుష్ప స్పెషల్ సాంగ్ 20 కోట్ల వ్యూస్ సొంతం చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించింది అని చెప్పాలి.

అనిమల్ మూవీ నటుడిని కొత్తగా చూపించబోతున్న అనిల్ రావిపూడి…