గోరుచుట్టు మీద రోకలి పోటు.. ఆ కామెంట్లు సమంతను బాధ పెడుతున్నాయట!
TeluguStop.com
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే.
అరుదైన ఆరోగ్య సమస్యతో సమంత బాధ పడుతుందని తెలిసి ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురి కావడంతో పాటు సమంత త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
సమంత ప్రస్తుతం సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి కూడా ఆమె ఆరోగ్య సమస్యలే కారణం కావడం గమనార్హం.
అయితే గోరుచుట్టు మీద రోకలిపోటులా కొన్ని కామెంట్లు సమంతను బాధ పెడుతున్నాయి.సమంత నటించిన యశోద మూవీ మరికొన్ని రోజుల్లో థియేటర్లలో విడుదలవుతోంది.
శుక్రవారం థియేటర్లలో విడుదలవుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.అయితే ఈ సినిమా బడ్జెట్ 40 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.
అయితే ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నాన్ థియేట్రికల్, థియేట్రికల్ హక్కుల ద్వారా 32 కోట్ల రూపాయలు నిర్మాతకు దక్కింది.
ఈ సినిమా శాటిలైట్ డీల్ ఇంకా పూర్తి కాలేదని సమాచారం అందుతోంది.హిందీ, కన్నడ భాషలలో నిర్మాత సొంతంగా రిలీజ్ చేస్తున్నారు.
అయితే సమంత సినిమా బడ్జెట్ గురించి కొంతమంది ట్రోల్స్ చేస్తుండటంతో సామ్ ఫీలవుతున్నారని తెలుస్తోంది.
అదే సమయంలో సమంత వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొంతమంది ట్రోల్స్ చేస్తుండగా ఆ ట్రోల్స్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
"""/"/
విడాకుల తర్వాత సమంత జీవితం అనుకున్న విధంగా అయితే లేదని తెలుస్తోంది.
కొత్తకొత్త ఆరోగ్య సమస్యలు వేధిస్తుండటంతో సమంత మానసికంగా కూడా బాధ పడుతున్నారని సమాచారం అందుతోంది.
ఎంతో ప్రతిభ ఉన్న సమంత తరచూ ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం.
స్టార్ హీరోయిన్ సమంత ఈ కామెంట్ల గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
యశోదతో సమంత సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్19, మంగళవారం 2024