సమంత చిల్ మూడ్.. ట్రోల్స్ ను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా..!
TeluguStop.com
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Heroine Samantha ) గత కొన్ని రోజులుగా చిల్ మూడ్ లో కనిపిస్తోంది.
ఆ మధ్య మయో సైటిస్ సమస్య కారణంగా తీవ్రమైన అస్వస్థత ను ఎదుర్కొన్న విషయం తెల్సిందే.
ఆ సమయంలో కనీసం లేవలేని పరిస్థితిని ఎదుర్కొన్న సమంత ఇప్పుడు మళ్లీ యాక్షన్ సన్నివేశాలతో సహా దుమ్ము దులిపేస్తోంది.
ఓ రేంజ్ లో కుమ్మేస్తుంది.సిటాడెల్ సిరీస్( Citadel Series ) కోసం సమంత పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు.
ఏ రేంజ్ లో ఆమె యాక్షన్ సన్నివేశాలు( Action Scenes ) చేస్తుందో చూస్తూనే ఉన్నాం.
ఇప్పుడు సమంత చిల్ మూడ్( Samantha Is In A Chill Mood ) లో కనిపిస్తోంది.
ఒక వ్యక్తి తో సమంత ఉన్న పోటోలు వైరల్ అవుతున్నాయి.ఆ వ్యక్తి ఎవరు అనేది క్లారిటీ లేదు.
కానీ ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుకుంటున్నారు.అతడు స్నేహితుడు అయ్యి ఉంటాడు అంటూ సమంత అభిమానులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఆమె ప్రియుడు అయ్యి ఉంటాడా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత గురించి చాలా రకాలుగా పుకార్లు షికార్లు చేశాయి.
"""/" /
ఎట్టకేలకు ఆమె హీరోయిన్ గా బిజీ అవ్వడంతో పుకార్లు ఆగిపోయాయి.
కానీ సమంత యొక్క కొత్త ఫోటోలు అనేక అనుమానాలకు తెర తీస్తున్నాయి.సమంత యొక్క అందాల ఆరబోత ఫోటోలు ఈ మధ్య కాలంలో కాస్త తగ్గాయి.
అంతే కాకుండా ఆమె యొక్క ప్రవర్తన గతంతో పోల్చితే విభిన్నంగా ఉందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
చాలా కూల్ గా సినిమాలు మరియు సిరీస్ లు చేసుకుంటూ వెళ్తోంది.సోషల్ మీడియాలో గతంలో మాదిరిగా యాక్టివ్ గా కనిపించడం లేదు.
తాజా ఫోటో ల్లో ఉన్న ఆ వ్యక్తి ఎవరు అంటూ సమంత ఎప్పటికి సమాధానం చెబుతుందో చూడాలి.
ఇక సమంత తాజాగా వివాహ నిశ్చితార్థం చేసుకున్న వరుణ్ మరియు లావణ్య త్రిపాఠి కి శుభాకాంక్షలు తెలియజేశారు.