సమంత ఈజ్‌ బ్యాక్‌… అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తున్న న్యూ లుక్‌

స్టార్ హీరోయిన్ సమంత ( Samantha ) గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

ఇటీవలే సమంత షూటింగ్స్ కి హాజరవుతోంది.అదే సమయం లో తాను గతంలో నటించిన శాకుంతలం( Sakunthalam ) సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుంది.

సమంత హీరోయిన్ గా సినిమాల్లో చాలా అందంగా కనిపిస్తుంది.సినిమాల్లో ఎంతైతే అందంగా కనిపిస్తుందో బయట కూడా అంతే అందంగా ఆమె కనిపిస్తుంది అనడం లో సందేహం లేదు.

అయితే ఆ మధ్య అనారోగ్య సమస్యల కారణంగా ముఖంలో గ్లో తగ్గింది.అలాగే ఆమె ఫిజిక్ విషయం లో కూడా విమర్శలు వ్యక్తం అయ్యాయి.

అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న సమంత ఫేస్ చార్మింగా లేదంటూ చాలా మంది చేసిన విమర్శలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.

"""/" / ఆ విమర్శలకు సమంత చెప్పిన సమాధానం కూడా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

ఎట్టకేలకు సమంత మునుపటి రూపం కనిపించింది.ఆమె శాకుంతలం సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమం( Promotion Program ) లో భాగంగా మీడియా ముందు సందడి చేసింది.

ఆ సమయం లో సమంత యొక్క కొత్త లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది ఈ మధ్య కాలం లో ఆమె నటించిన సినిమాల్లో ఎలా అయితే అందంగా కనిపించిందో మీడియా ముందు కూడా అలాగే కనిపించిందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి సమంత ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు సందడి చేస్తున్నారు.ఆమె లుక్ ఫ్యాన్స్ కి ఆనందాన్ని కలిగిస్తుంది.

సమంత యొక్క అందాల ఆరబోత ముందు ముందు మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయంటూ అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

హిందీలో కూడా సిరీస్‌ లతో ఈ అమ్మడు బిజీగా ఉంది.తెలుగు లో ఈమె విజయ్ దేవరకొండకు జోడీగా ఖుషి( Khushi ) సినిమా లో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే.

ఏందిది.. లగ్జరీ బ్యాగులు పక్కన పెట్టేసి.. బాస్మతి బియ్యం సంచులను వాడుతున్న అమెరికన్లు..