పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలనే అనుకున్నా, కాని..!

హీరోయిన్స్‌ పెళ్లి తర్వాత చాలా వరకు సినిమాలు మానేస్తారు.కాని సమంత మాత్రం సినిమాలు మానేయలేదు సరికదా స్పీడ్‌ పెంచింది.

అయితే కాస్త హాట్‌ పాత్రలు తగ్గించి కమర్షియల్‌ పాత్రలకు దూరంగా ఉంటూ నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తోంది.

ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాలను దక్కించుకుంటున్న నేపథ్యంలో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.

ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలతో ఈ అమ్మడు ఆకట్టుకుంటోంది.వరుసగా ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాలు దక్కించుకుంటున్న నేపథ్యంలో భారీగా పారితోషికం కూడా పెంచింది.

తాజాగా మోస్ట్‌ డిజైరబుల్‌ ఉమెన్‌ నెం.1 గా నిలిచిన సమంత ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్‌ గురించి మీడియాలో వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది.

తాను పెళ్లి అయిన వెంటనే సినిమాలకు గుడ్‌ బై చెప్పాలనుకున్నాను.ఆవిషయాన్ని చైతూ వద్ద చెప్పగా నీకేమైనా మైండ్‌ పని చేయడం లేదా అంటూ నన్ను తిట్టాడు.

"""/"/సినిమాల్లో నటించే అవకాశం అందరికి రాదు.వచ్చినా స్టార్స్‌గా గుర్తింపు తెచ్చుకోవడం సాధ్యం కాదు.

కాని నీకు ఆ ఛాన్స్‌ వచ్చింది.అలాంటి అవకాశాన్ని ఎందుకు వదులుకుంటావు అన్నాడు.

ఆయన ప్రోత్సాహంతోనే నేను వరుసగా చిత్రాలు చేస్తున్నాను అంటూ క్లారిటీ ఇచ్చింది.కొందరు చైతూకు ఇష్టం లేకుండా ఈమె సినిమాలు చేస్తుందని చేస్తున్న విమర్శలకు ఈ వ్యాఖ్యలతో సమాధానం ఇచ్చింది.

ఇదేందయ్యా ఇది.. తీసేకొద్దీ బంగారం, డబ్బులు (వీడియో)