జీవితంలో ఆ పని అస్సలు చేయను…. అది నా వ్యక్తిగతం… సమంత కామెంట్స్ వైరల్!
TeluguStop.com
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ( Samantha )ప్రస్తుతం తిరిగి సినిమాలలో బిజీ అవుతున్నారు.
ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న ఈమె నాగచైతన్యను ( Nagachaitanya ) పెళ్లి చేసుకుని విడాకుల ( Divorce )తర్వాత కాస్త డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.
ఈ సమయంలోనే మయోసైటిసిస్ వ్యాధితో కూడా బాధపడుతున్న నేపథ్యంలో కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు అయితే ఇప్పుడిప్పుడే ఈమె తిరిగి సాధారణ స్థితికి రావడంతో సినిమాలపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారని తెలుస్తోంది.
"""/" /
ఇక సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత నాగచైతన్య తిరిగి శోభితను రెండవ వివాహం చేసుకున్నారు.
ఈ క్రమంలోనే సమంత కూడా రెండో పెళ్లి చేసుకుంటుందని అందరూ భావించారు.అయితే గత కొద్దిరోజులుగా ఈమె డైరెక్టర్ రాజ్ తో చాలా చనువుగా కనిపిస్తున్న నేపథ్యంలో ఈమె కూడా ప్రేమలో పడిందని ఏ క్షణమైన ఈ శుభవార్తను అందరితో పంచుకుంటారు అంటూ వార్తలు హల్చల్ చేశాయి.
"""/" /
ఇలా సమంత గురించి ఆమె ప్రేమలో పడ్డారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో సమంత స్పందించారు.
ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.జీవితంలో మళ్లీ ప్రేమలో పడాలని ఎప్పుడూ కూడా ఆలోచించలేదు.
వాటిపై ఇంక చర్చించాలనీ లేదు.అది నా పూర్తి వ్యక్తిగతమైన విషయం.
దాన్ని అలాగే వ్యక్తిగతంగానే ఉంచుతాను.అంటూ చెప్పుకొచ్చింది.
సమంత చేసిన ఈ కామెంట్స్ చూస్తుంటే ఈమె తిరిగి ప్రేమలో పడే అవకాశాలే లేవని స్పష్టమవుతుంది.
అయితే ప్రస్తుతం ఈమె మాత్రం పూర్తి దృష్టిని సినిమాలపైనే పెట్టినట్లు వెల్లడించారు.