చేతిలో సినిమాలు లేకపోయినా టాప్ హీరోయిన్గా సమంత.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ ఉన్నటువంటి సమంత ( Samantha ) ఇటీవల కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.

ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈమె పూర్తిగా తన దృష్టి మొత్తం తన ఆరోగ్యం పైన పెట్టారు.

సమంత గత కొంతకాలంగా మాయోసైటిస్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు.ఇలా ఈ వ్యాధితో బాధపడుతూ ఉన్నటువంటి ఈమె ఈ వ్యాధికి చికిత్స తీసుకోవడం కోసం కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి విరామం ప్రకటించారు.

"""/" / ఇలా ఇండస్ట్రీకి విరామం ఇచ్చినటువంటి సమంత పలు దేశాలకు వెళ్తూ ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటూ పూర్తిగా ఈ వ్యాధి నుంచి కోలుకున్నారని తెలుస్తుంది.

ఇక ఇటీవల కాలంలో ప్రవేట్ ఈవెంట్లకు సమంత హాజరవ్వడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

అదేవిధంగా త్వరలోనే సమంత తిరిగి ఇండస్ట్రీలోకి కూడా గ్రాండ్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని కూడా తెలుస్తోంది.

"""/" / ఇక ప్రస్తుతం ఈమెకు చేతిలో ఒక సినిమా కూడా లేదు.

ఇతర హీరోయిన్లు రెండు మూడు సినిమా పనులలో బిజీగా ఉండగా సమంత మాత్రం చేతిలో ఒక్క సినిమా లేకపోయినా నెంబర్ వన్ సెలబ్రిటీగా కొనసాగటం అభిమానులను ఎంతో ఆనందానికి గురిచేస్తుంది.

తాజాగా ప్రముఖ సెలబ్రిటీ పోలింగ్‌ సంస్థ ఓర్మాక్స్( Ormax ) మీడియా ప్రకటించిన జాబితాలో సమంత మొదటి స్థానంలో నిలిచింది.

మార్చి నెలలో ఇండియా వైడ్‌గా పాపులర్‌, క్రేజ్‌ని, సొంతం చేసుకున్నటువంటి హీరోయిన్లలో సమంత నెంబర్‌ 1గా నిలవడం విశేషం.

సినిమాలు చేయకపోయినా సమంత మొదటి స్థానంలో ఉన్నారని తెలిసే అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 .