అల్లు అర్హ మీద సమంత కామెంట్స్..!
TeluguStop.com
అల్లు ఫ్యామిలీ నుండి మూడవ తరం నటులు తెరంగేట్రం చేస్తున్నారు.సమంత శాకుంతలం సినిమాలో అల్లు అర్జున్ తనయురాలు అల్లు అర్హ నటిస్తుంది.
సినిమాలో ఆమెది చాలా ఇంపార్టెంట్ రోల్ అని తెలుస్తుంది.కలిసి సినిమా చేస్తున్న కారణంగా అల్లు అర్హ గురించి స్పెషల్ కామెంట్స్ చేసింది.
అల్లు అర్హ జన్మత రాక్ స్టార్ గా పుట్టిందని.తన తొలి స్టెప్ లోనే మంచి మార్గాన్ని ఎంచుకుంది.
అర్హ తన సినిమా ద్వారా పరిచయం అవుతుండటం తనకు ఆనందంగా ఉందని అన్నారు సమంత.
భవిష్యత్తులో అల్లు అర్హ ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలుతుందని ఆమె ఫ్యూచర్ చెప్పేసింది సమంత.
గుణశేఖర్ డైరక్షన్ లో సమంత మెయిన్ లీడ్ గా చేస్తున్న శాకుంతలం సినిమాలో యువరాజు భరతుడిగా అల్లు అర్హ నటిస్తుంది.
ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ పూర్తి కాగా అల్లు అర్హ నటనకు సమంత చాలా ఇంప్రెస్ అయినట్టు తెలుస్తుంది.
సినిమాలో అర్హ అదరగొట్టేస్తుందని అంటున్నారు.పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న శాకుంతలం సినిమాతో సమంత మొదటిసారి తన కెరియర్ లో మైథలాజికల్ మూవీ చేస్తుంది.
ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల అంచనాలకు తగినట్టుగానే ఉంటుందని చెబుతున్నారు చిత్రయూనిట్.
ప్రమోషన్స్ విషయంలో వెంకీనే తోపు.. బాలయ్య, చరణ్ నేర్చుకోవాల్సిందే!