ప్రతి ఒక్కరూ నన్ను అర్థం చేసుకున్నారు.. పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తా: సమంత
TeluguStop.com
సినీనటి సమంత ( Samantha ) విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) జంటగా నటించిన చిత్రం ఖుషి( Khushi ) .
ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హైదరాబాదులో ఎంతో ఘనంగా ఈ సినిమా మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు.ఇక ఈ కార్యక్రమానికి సమంత కూడా హాజరై సందడి చేశారు.
ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా సమంత మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
"""/" /
ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ ఈ సినిమాలోని పాటలు తనకు ఎంతో అద్భుతంగా నచ్చాయని తెలిపారు.
మీ అందరితో పాటు తాను కూడా సెప్టెంబర్ ఒకటవ తేదీ ఈ సినిమాని చూడడం కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని సమంత వెల్లడించారు అదేవిధంగా తనకోసం నిర్మాతలు చాలా ఓపికగా ఎదురు చూసినందుకు ఈమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత సమంత మయోసైటీస్ వ్యాధికి గురైన సంగతి తెలిసిందే.
"""/" /
ఇలా ఈ వ్యాధి బారిన పడిన ఈమె ఈ సినిమా షూటింగుకు దూరంగా ఉన్నారు.
అయినప్పటికీ సమంత ఆరోగ్యం కుదుటపడే వరకు కూడా దర్శకనిర్మాతలు ఆమెకు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా తనకు సమయం ఇచ్చారని తనని అర్థం చేసుకొని ఎంతో ఓపికగా ఎదురుచూసిన దర్శక నిర్మాతలకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఇక అభిమానులను ఉద్దేశించి సమంత మాట్లాడుతూ మీకోసమే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను.
తప్పకుండా పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చి మంచి సినిమాలను చేస్తాను అంటూ సమంత ఈ సందర్భంగా సామ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
రవితేజ తో మరో సినిమా ప్లాన్ చేస్తున్న స్టార్ డైరెక్టర్…