ప్రతి అమ్మాయికి ఇలాంటి అన్న ఒకరు ఉండాలి.. సమంత కామెంట్స్ వైరల్!

అలియాభట్‌, వేదాంగ్‌ రైనా ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకున్న జిగ్రా( Jigra ) సినిమా అక్టోబర్‌ 11న విడుదల కానున్న నేపథ్యంలో హైదరాబాదులో ఎంతో ఘనంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.

ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, సమంత ( Samantha ) , రానా( Rana ), రాహుల్ రవీందర్ వంటి తదితరులు హాజరై సందడి చేశారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సమంత పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురిపించారు.

ఇటీవల కాలంలో సమంత ముంబైకి పరిమితం కావడంతో ముంబైలో మాత్రమే కాకుండా అప్పుడప్పుడు హైదరాబాద్ కి కూడా రావాలి అంటూ కోరారు.

"""/" / ఇక సమంత కూడా ఇన్ని రోజుల తన వ్యక్తిగత కారణాల వల్ల సినిమా ఇండస్ట్రీకి మీడియా కూడా చాలా దూరంగా ఉన్నారు.

అయితే ఇప్పుడిప్పుడే సమంత పూర్తిగా కోలుకోవడంతో ఈమె తిరిగి సినిమా పనులలో బిజీ అయ్యారు.

ఇక ఈ సినిమా వేడుకలో భాగంగా సమంత వేదికపై మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

"""/" / హీరోయిన్స్‌కి ఎంతో బాధ్యత ఉంటుందని అన్నారు.ప్రతి అమ్మాయి కథలో ఆ అమ్మాయే హీరో అని చెప్పారు.

చాలా రోజుల తరువాత మీ ముందుకు వచ్చానని, జిగ్రా మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నానని అన్నారు.

ఇక ప్రతి ఒక్క అమ్మాయి జీవితంలో రానా లాంటి ఒక అన్నయ్య ఉండాలని ఈమె ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇక తెలుగు సినీ ప్రేక్షకులే నా ఫ్యామిలీ అంటూ ఈ సందర్భంగా సమంత వెల్లడించారు.

ఇక రానా లాంటి అన్నయ్య కావాలని సమంత ఈ సందర్భంగా చెప్పడంతో రానా సమంత మధ్య ఎంత మంచి బాండింగ్ ఉందో స్పష్టంగా అర్థమవుతుంది.

అలాంటి వీడియోల వల్ల ఇబ్బందులు పడుతున్నారు.. అనిల్ రావిపూడి కామెంట్స్ వైరల్!