షూటింగ్లో తీవ్ర గాయాలు పాలైన సమంత… వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్!

సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు షూటింగ్ లో పాల్గొన్న సమయంలో గాయాలు పాలు కావడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది.

ఇలా ఎంతోమంది కొన్ని సందర్భాలలో మరణించిన సంఘటనలు కూడా ఉన్నాయి.టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎంత మంచి సక్సెస్ అందుకున్న నటి సమంత( Samantha ) కూడా షూటింగ్లో భాగంగా గాయాలు పాలయ్యారని తెలుస్తోంది.

అయితే ఈ విషయాన్ని స్వయంగా సమంత సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో ఈ పోస్ట్ కాస్త వైరల్ అవుతుంది.

ఇన్ని రోజులు తన వ్యక్తిగత కారణాలు, అనారోగ్య సమస్యల కారణంగా సమంత సినిమా ఇండస్ట్రీకి విరామం ప్రకటించారు.

ఇప్పుడిప్పుడే తిరిగి ఈమె వరస ప్రాజెక్టులకు కమిట్ అవుతున్నారు.  """/" / ఈ క్రమంలోనే సమంత తన సొంత నిర్మాణంలో నటిస్తున్నటువంటి బంగారం ( Bangaram ) అనే సినిమాకు కమిట్ అయ్యారు.

ఈ సినిమా మినహా ఈమె ఇతర ప్రాజెక్టులను ఇంకా ప్రకటించలేదు అయితే షూటింగ్లో భాగంగా తాను గాయాలు పాలయ్యాను అంటూ సమంత షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

మోకాలికి అయిన గాయానికి సూదులతో (ఆక్యుపంక్చర్) చికిత్స తీసుకుంటున్న ఫోటోని షేర్ చేశారు.

  """/" / ఇలా ఈ ఫోటోని షేర్ చేసిన సమంత గాయాలు కాకుండా యాక్షన్ స్టార్ ను కాగలనా? అని ఆమె రాసుకొచ్చింది.

అయితే ఈమె ఏ షూటింగ్లో పాల్గొన్నారు.ఎక్కడ గాయపడ్డారనే విషయాలను తెలియ చేయకపోయిన ప్రస్తుతం ఈమె బంగారం సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు.

బహుశా అక్కడే ప్రమాదం జరిగి ఉండవచ్చని అభిమానులు భావిస్తున్నారు.ఇలా ఈమె షేర్ చేసిన ఈ ఫోటో చూసిన అభిమానులు ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా తాను త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.

ఇలా ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు పడిన సమంత మరోసారి గాయాలు పాలయ్యారనే విషయం తెలిసిన అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అధిక రక్తపోటుకు చెక్ పెట్టాలా.. అయితే మీ డైట్ లో ఇది ఉండాల్సిందే!