సమంత దగ్గర ఉద్యోగం చేయాలనుకుంటున్నారా.. ఈ అర్హత ఉంటే చాలు?
TeluguStop.com
సినీ నటి సమంత( Samantha ) ఇన్ని రోజులపాటు తన అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు చిన్న విరామం ప్రకటించి పూర్తి దృష్టి తన సినిమాల పైన పెట్టారు.
ఈ విధంగా సమంత ఇప్పుడిప్పుడే తన ఆరోగ్య సమస్యల నుంచి బయటపడటంతో తిరిగి ఇండస్ట్రీలో బిజీగా మారబోతున్నారు.
ఇప్పటికే ఈమె పలు సినిమాలు వెబ్ సిరీస్లలో బిజీ కాగా మరోవైపు నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించి సినిమాలను మొదలుపెట్టారు.
ఇలా సినిమాలలో మాత్రమే కాకుండా ఈమె వ్యాపార రంగంలో కూడా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.
"""/" /
సమంత సాకీ ( Saaki ) అనే దుస్తుల వ్యాపారం ప్రారంభించారు.
ఇక ఈ సంస్థకు ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా మారి పెద్ద ఎత్తున ప్రమోషన్ చేసుకుంటూ బిజినెస్ రంగంలో కూడా మంచి సక్సెస్ అందుకున్నారు.
అయితే తాజాగా సమంత తన వ్యాపార సంస్థలు పని చేయటానికి అభ్యర్థులు కావాలి అంటూ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు.
తగు అర్హతలు ఉన్నవాళ్లు వివరాలు పంపాలని ప్రకటించింది. """/" /
ఫ్యాషన్ డిజైన్ మేనేజర్/అసిస్టెంట్ మేనేజర్, ఫ్యాషన్ డిజైన్ ఎగ్జిక్యూటివ్, బ్రాండ్ మార్కెటింగ్ తో పాటు మరో రెండు పొజిషన్స్ కొరకు ఆమె అభ్యర్థుల ఎంపికకు దరఖాస్తులు కోరింది.
ప్రకటనలో పొందు పరిచిన ఈ మెయిల్ అడ్రస్ కి వివరాలు పంపాలని వెల్లడించారు.
ఇలా సమంత స్థాపించినటువంటి బిజినెస్ లలో ఉద్యోగం చేయాలి అంటే మామూలు విషయం కాదు ఎవరికైనా అర్హతలు ఉంటే వెంటనే అప్లై చేసుకోండి ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ సంస్థలో మా ఇంటి బంగారం అనే లేడీ ఓరియంటెడ్ సినిమా ద్వారా సమంత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఇటీవల ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.
సాయం చేయడానికి ఎవరూ లేరు… ఆ కారణంతోనే బతికున్నా… స్టార్ డైరెక్టర్ కామెంట్స్ వైరల్!