విజయ్ తో సమంత హ్యాట్రిక్ ఛాన్స్..!

ఆఫ్టర్ డైవర్స్ సమంత తన సినీ కెరియర్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది.

ఎలాంటి ఛాన్స్ వచ్చినా సరే వదిలి పెట్టకుండా చేస్తుంది అమ్మడు.సౌత్ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న సమంత ఇప్పటికి వరుస అవకాశాలు అందుకుంటుంది.

ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా చేస్తున్న సమంత ఆల్రెడీ గుణశేఖర్ డైరక్షన్ లో శాకుంతలం, యశోద సినిమాలు పూర్తి చేసింది.

ఇక మరోపక్క బాలీవుడ్ నుంచి వెబ్ సీరీస్ అవకాశాలను అందుకుంటుంది సామ్.ఇదిలాఉంటే కోలీవుడ్ నుంచి మరో క్రేజీ ఆఫర్ సొంతం చేసుకుందట సమంత.

దళపతి విజయ్ 67వ సినిమాలో సమంత హీరోయిన్ గా ఫిక్స్ అయిందని టాక్.

విజయ్ 66వ సినిమా వంశీ పైడిపల్లి డైరక్షన్ లో చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ డైరక్షన్ లో మరో సినిమా వస్తుంది.

మాస్టర్ కాంబో రిపీట్ చేస్తూ వస్తున్న ఈ మూవీలో సమంతని హీరోయిన్ గా తీసుకుంటున్నారని తెలుస్తుంది.

ఆల్రెడీ విజయ్ తో రెండు సినిమాల్లో నటించిన సమంత ఇప్పుడు హ్యాట్రిక్ ఛాన్స్ అందుకుంది.

 ఇదే కాకుండా సమంత కి మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లు కూడా లైన్ లో ఉన్నాయని తెలుస్తుంది.

వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తున్నారా ?