సమంత 'శాకుంతలం' అప్డేట్ ఇచ్చిన యంగ్‌ లేడీ ప్రొడ్యూసర్‌

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ సమంత కొత్త సినిమా అప్ డేట్ వచ్చింది.ఆమె కరోనా కారణంగా కాస్త ఎక్కువ గ్యాపే తీసుకుంది.

ఈమద్య కాలంలో ఆమె అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా ది ఫ్యామిలీ మ్యాన్ 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఆ వెబ్‌ సిరీస్ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఆమెకు మరింతగా క్రేజ్ ఉత్తరాదిన వచ్చింది.

ఈ నేపథ్యంలో ఈమె నటిస్తున్న శాకుంతలం సినిమా పై అందరి దృష్టి ఉంది.

శాకుంతలం సినిమా షూటింగ్ ను కరోనా కారణంగా నిలిపి వేశారు.కరోనా సెకండ్‌ వేవ్‌ కు ముందే 50 శాతం ఈ సినిమా ను పూర్తి చేశారు.

ఇక నేటి నుండి ఈ సినిమా షూటింగ్ ను పునః ప్రారంభించినట్లుగా నిర్మాత నీలిమ గుణ పేర్కొన్నారు.

గుణశేఖర్‌ కూతురు అయిన నీలిమ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.దిల్‌ రాజు ఈ సినిమా ను నిర్మిస్తున్నారు.

పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా షూటింగ్‌ పునః ప్రారంభం అవ్వడం వల్ల ఖచ్చితంగా ఈ ఏడాది చివరి వరకు షూటింగ్‌ ను ముగించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

శాకుంతలం సినిమా లో సమంత ను చాలా విభిన్నంగా చూడబోతున్నాం.ఇప్పటి వరకు ఆమె మోడ్రన్‌ డ్రస్‌ లతో అల్ట్రా మోడ్రన్‌ గా కనిపించింది.

"""/"/ కాని ఈ సినిమా లో మాత్రం పూర్వ కాలం శాకుంతల దేవి గా కనిపించబోతుంది.

మరి సమంతకు ఈ లుక్‌ ఎంత వరకు వర్కౌట్‌ అవుతుంది అనేది త్వరలో ఫస్ట్‌ లుక్‌ వస్తే కాని తెలియదు.

షూటింగ్‌ పునః ప్రారంభం అయ్యింది కనుక ఖచ్చితంగా ఒకటి రెండు నెలల్లోనే మంచి సందర్బం చూసి ఫస్ట్‌ లుక్ ను ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ పెద్దగా ఈవెంట్స్ కి రాకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా..?