Samantha: న్యూయార్కులో సమంత రచ్చ.. అక్కడ కూడా ఫాలోయింగ్ మామూలుగా లేదుగా?
TeluguStop.com
ఏం మాయ చేసావే సినిమాతో అందర్నీ మాయ చేసిన సమంత( Samantha ) గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఒక హీరోయిన్గా ఎంత గుర్తింపు తెచ్చుకుందో వ్యక్తిగతంగా కూడా అంతే హాట్ టాపిక్ గా మారింది.
నటిగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకోగా.వ్యక్తిగతంగా బాగా విమర్శలు ఎదుర్కొంటుంది.
మొదటి సినిమాతో అందరిని ఆకట్టుకున్న సమంతకు ఆ తర్వాత వెనుకకు తిరిగి చూడకుండా వరుసగా అవకాశాలు వచ్చాయి.
అలా స్టార్ హీరోలతో జతకట్టి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.అంతేకాకుండా కుర్రాళ్ళ క్రష్ లిస్టులో కూడా చేరిపోయింది.
పైగా అక్కినేని నాగచైతన్యను( Naga Chaitanya ) ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో అందరూ తనకు మరింత పడిపోయారని చెప్పాలి.
పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరూ తన నాగచైతన్య తో ఉండే విధానాన్ని చూసి ఫిదా అయ్యారు.
కానీ ఏం జరిగిందో తెలియదు మూడేళ్లకే విడిపోయి అందరికీ జీర్ణించుకోలేని షాక్ ఇచ్చారు.
"""/" /
అసలు ఏ సెలబ్రెటీ దంపతులు విడిపోయిన కూడా ఇంతలా ఎవరు బాధపడలేదని చెప్పాలి.
ఇప్పటికీ కూడా వారిద్దరు ఒకటైతే బాగుండు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు.
కానీ ఇద్దరు ఎవరి దారి వాళ్లు అన్నట్లుగా సెటిల్ అయ్యారు.ఇక అప్పటినుంచి ఇద్దరు ఒంటరిగానే ఉంటున్నారు కానీ మరో కొత్త జీవితాన్ని ఏర్పరచుకోలేదు.
బహుశా పెళ్లి వైపే అడుగులు వేయొద్దు అని అనుకుంటున్నారేమో.కానీ వీరి అభిమానులు మాత్రం వీరిద్దరూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు.
కానీ వారిద్దరూ ఇప్పుడైతే పెళ్లి చేసుకునే ఉద్దేశంలో లేరని చెప్పాలి.ఇక ఇద్దరు కెరీర్ పట్ల బాగా దృష్టి పెట్టారు.
ఇక సమంత విడాకుల( Samantha Divorce ) తర్వాత మళ్లీ ఒకప్పటి క్రేజ్ తెచ్చుకోవడం లేదని చెప్పాలి.
"""/" /
తను చేసిన సినిమాలు కూడా ఫ్లాప్ అవుతున్నాయి.ఇక చైతన్య స్టార్ హోదా కోసం ఆరాటపడుతున్నాడు.
ఇక సమంత మాత్రం ఇప్పుడు తన ఆశలన్నీ విజయ్ దేవరకొండ తో కలిసి నటించిన ఖుషి సినిమా( Kushi Movie ) పైనే పెట్టుకుంది.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పాటలు వైరల్ అవుతున్నాయి.అంతేకాకుండా రీసెంట్ గా ఈ సినిమా ఈవెంట్లో విజయ్ దేవరకొండ, సమంత ఒక పాటకు పర్ఫామెన్స్ ఎలా చేశారో చూసాం.
ఆ సమయంలో నాగచైతన్య అభిమానులు అది చూసి తట్టుకోలేక పోయారు.చాలామంది సమంతను మళ్ళీ తిట్టిపోసుకున్నారు.
కానీ సమంత అవేవీ పట్టించుకోకుండా తన లైఫ్ ఏంటో తాను ఎంజాయ్ చేస్తుంది.
నిజానికి తను ఏ హీరోతో లేనంత క్లోజ్ గా విజయ్ దేవరకొండ తో చాలా క్లోజ్ గా కనిపిస్తుంది.
ఇక ప్రస్తుతం తను విదేశాలలో ఉండగా అక్కడ దిగిన ఫోటోలను, వీడియోలను బాగా పంచుకుంటుంది.
"""/" /
తాజాగా తను న్యూయార్క్ లో ( New York )ఉండగా అక్కడికి సంబంధించిన కొన్ని ఫొటోస్ పంచుకుంది.
అందులో తను ధరించిన అవుట్ ఫిట్ చాలా అందంగా ఉందని చెప్పాలి.ఇక అక్కడ జనాల మధ్య బాగా రచ్చ చేసినట్లు కనిపించింది.
ఇక అక్కడున్న వాళ్లంతా సమంతతో సెల్ఫీల కోసం బాగా ఆరాటపడుతున్నట్లు కనిపించింది.ఇక్కడే కాకుండా అక్కడ కూడా సమంతకు మంచి ఫాలోయింగ్ ఉందని అర్థం అవుతుంది.
ప్రస్తుతం ఆ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.
మిస్టర్ బచ్చన్ మూవీపై జోకులు వేసిన రానా.. ఘాటుగా స్పందించిన హరీష్ శంకర్!