Samantha: రెండో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన సమంత..మళ్లీ విడాకులే అంటూ..!!
TeluguStop.com
సౌత్ హీరోయిన్ సమంత( Samantha ) ప్రస్తుతం మయోసైటిస్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇండస్ట్రీకి దూరంగా ఉంది.
అయితే ఈ మధ్యనే సమంత ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే.
ఈమె ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసింది అనే విషయం తెలియగానే అందరూ హీరోయిన్ గా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి నిర్మాత గా రాణిస్తుంది కావచ్చు అని అందరూ భావించారు.
అయితే దీనిపై ఇప్పటివరకు క్లారిటీ అయితే లేదు.ఇక సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో షేర్ చేస్తూ అభిమానులతో ముచ్చటిస్తుంది.అయితే చాలా రోజుల తర్వాత అభిమానులతో చిట్ చాట్ చేసింది సమంత.
"""/"/ ఇందులో భాగంగా చాలా మంది అభిమానులు ఆమెను ఎన్నో రకాల ప్రశ్నలు వేశారు.
ఇక అందులో ఒక అభిమాని అయితే మీరు మళ్ళీ రెండో పెళ్లి( Second Marriage ) ఎప్పుడు చేసుకుంటారు అని ధైర్యం చేసి అడిగారు.
ఇక దీనికి సమంత ఎలాంటి ఆన్సర్ ఇస్తుందో అని అందరూ భావించారు.అయితే సమంత మాత్రం ఎవరికి అర్థం కాని ఒక ఆన్సర్ ఇచ్చింది.
అదేంటంటే తాజా నివేదికల ప్రకారం చెడ్డ పెట్టుబడి అవుతుంది అంటూ ఒక షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది.
అంతేకాదు 2023 లో డివోర్స్ తీసుకున్న ఒక నివేదిక స్క్రీన్ షాట్ తీసి ఫోటో పెట్టింది.
అయితేఈ స్క్రీన్ షాట్ లో ఏముందంటే.2023 విడాకుల నివేదిక ప్రకారం చూసుకుంటే ఫస్ట్ టైం పెళ్లి చేసుకున్న వారు 50 శాతం మంది విడాకులు తీసుకుంటున్నారు.
అలాగే రెండోసారి పెళ్లి చేసుకున్న వారు 67% డివోర్స్ తీసుకొని విడిపోతున్నారు.ఇక మూడో పెళ్లి చేసుకున్న వారైతే ఏకంగా 73 శాతం మంది విడాకులు తీసుకొని విడిపోతున్నారు.
"""/"/
ఇక ఈ నివేదిక ప్రకారం ఆడ, మగ అనే తేడా లేకుండా అందరూ పెళ్లి( Marriage ) విషయంలో విడాకుల విషయంలో ఇలాగే ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.
అయితే సమంత ఆ స్క్రీన్ షాట్ పెట్టడానికి కారణం ఎంతమంది ఎన్నిసార్లు పెళ్లిళ్లు చేసుకున్నా చివరికి విడాకులే తీసుకుంటారు అంటూ చెప్పకనే చెప్పింది.
ఇక సమంతకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని ఆమె పెట్టిన స్క్రీన్ షాట్ ద్వారా అర్థమవుతుంది.
ఆస్ట్రేలియాలోని భారత కాన్సులేట్ కార్యాలయంపై విద్వేష దాడి