టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇంట తీవ్ర విషాదం.. అసలేం జరిగిందంటే?
TeluguStop.com
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకుంటూ ఇప్పుడిప్పుడే కెరీర్ పరంగా బిజీ అవుతున్నారనే సంగతి తెలిసిందే.
ప్రస్తుతం సమంత మా ఇంటి బంగారం అనే ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు.కెరీర్ పరంగా బిజీగా ఉన్న ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీ స్థాయిలో ఉంది.
అయితే ఈ స్టార్ హీరోయిన్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది.సమంత తండ్రి జోసెఫ్ ప్రభు( Joseph Prabhu ) ఆరోగ్య సమస్యలతో కన్నుమూశారు.
స్టార్ హీరోయిన్ సమంత తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ విషయాలను వెల్లడించారు.
“మనం మళ్లీ కలిసే వరకు, నాన్న” అంటూ సమంత హార్ట్ ఎమోజీని షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు.
సమంత తండ్రి( Samantha Father ) ఆంగ్లో ఇండియన్ కాగా తన సక్సెస్ లో తండ్రి కీలక పాత్ర పోషించారు.
సమంతకు దేవుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. """/" /
సమంతకు కెరీర్ పరంగా ఇబ్బందులు లేకపోయినా వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఈ బాధ నుంచి సమంత కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
మరోవైపు సమంత కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.సమంత నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్( Citadel ) తాజాగా విడుదలై ఆశించిన ఫలితాలను అయితే అందుకోలేదు.
"""/" /
క్యూట్ లుక్స్ తో అభిమానులను మెప్పించిన సమంత తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా ఫ్యాన్స్ ను అంచనాలకు మించి మెప్పిస్తారేమో చూడాలి.
పుష్ప2 లో సమంత తళుక్కున మెరుస్తారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.
సమంత ఇతర భాషలపై కూడా ఫోకస్ పెట్టి సంచలనాలు సృష్టించాలని అభిమానులు ఫీలవుతున్నారు.
స్టార్ హీరోయిన్ సమంత క్రేజ్ మాత్రం మామూలుగా లేదని కచ్చితంగా చెప్పవచ్చు.
కొడుకు పేరును వెరైటీగా చెప్పేసిన టీమిండియా కెప్టెన్ సతీమణి రితికా సజ్దే