హలో గుణశేఖర్ సర్‌... అసలేం జరుగుతుందో కాస్త చెప్పండి ప్లీజ్‌

2015 సంవత్సరం లో అనుష్క హీరోయిన్‌ గా తెరకెక్కిన రుద్రమ దేవి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గుణశేఖర్‌ దాదాపు ఆరు ఏళ్ల తర్వాత తన తదుపరి సినిమాను మొదలు పెట్టాడు.

అంతకు ముందు వరకు రానాతో హిర్యణ్య కశ్యప సినిమాను చేయబోతున్నట్లుగా చెబుతూ వచ్చాడు.

అంతే కాకుండా ఆయన ఇంకా పలు సినిమా లను కూడా చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.

కాని చివరకు గత ఏడాదిలో ఆయన సమంత తో శాకుతంలం అనే భారీ పాన్ ఇండియా పౌరాణిక సినిమాను చేయబోతున్నట్లుగా ప్రకటించాడు.

అన్నట్లుగానే సినిమాను మొదలు పెట్టాడు.సహజంగా అయితే దర్శకుడు గుణశేఖర్ తన సినిమా ను చాలా స్లోగా పూర్తి చేస్తాడు.

"""/"/ రుద్రమ దేవి సినిమాను ఏకంగా రెండేళ్ల పాటు చేశాడు.కాని శాకుంతలం సినిమాను కేవలం నాలుగు నెలల్లోనే ముగించినట్లుగా తెలుస్తోంది.

కరోనా సెకండ్‌ వేవ్‌ వల్ల కాస్త ఆలస్యం అయ్యింది తప్ప శాకుంతలం సినిమా చాలా స్పీడ్ గా పూర్తి అయ్యిందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో గుణశేఖర్‌ శాకుంతలం సినిమాను ఎప్పుడు తీసుకు వస్తాడా అంటూ అంతా ఎదురు చూస్తున్నారు.

చిత్ర యూనిట్ సభ్యులు షూటింగ్‌ ను ముగించినట్లుగా ప్రకటించారు కాని ఇప్పటి వరకు కనీసం పస్ట్‌ లుక్‌ ను కూడా రివీల్‌ చేయడం లేదు.

వచ్చే ఏడాది సమ్మర్ కు విడుదల అయిన కూడా ప్రమోషన్‌ కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది.

కాని ఇప్పటి వరకు గుణశేఖర్ నుండి ఎలాంటి అప్‌డేట్ లేదు.అసలు శాకుంతలం మద్యలో వదిలేశారా అనే అనుమనాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.

అందుకే సమంత అభిమానులు గుణశేఖర్ కు శాకుతలం అప్డేట్ ఇవ్వమని రిక్వెస్ట్‌ చేస్తున్నారు.

మరి ఎప్పటికి శాకుంతలం వస్తుందో చూడాలి.

‘భైరవం’ సినిమా క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోతుందా..?