Samantha : రాజకీయాలలోకి రాబోతున్న సమంత… ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం?

సినిమా ఇండస్ట్రీకి రాజకీయ రంగానికి ఎంతో మంచి అవినాభావ సంబంధం ఉందనే విషయం మనకు తెలిసిందే.

ఎప్పటినుంచో సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలందరూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న తర్వాత తిరిగి రాజకీయాలలోకి వెళ్తున్నారు.

ఇప్పటికే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు రాజకీయాలలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

అయితే త్వరలోనే మరొక నటి కూడా రాజకీయాల్లోకి వెళ్ళబోతుంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

"""/" / తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి సమంత( Samantha )ఒకరు.

సమంత రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.

ఈ క్రమంలోనే ఈమె రాజకీయాలలోకి వస్తే తమ పార్టీకి చాలా మంచి కలుగుతుందని భావించినటువంటి తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ ( BRS Party ) సమంతను తమ పార్టీలోకి ఆహ్వానించారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

"""/" / సమంత చేత వచ్చే ఎన్నికలలో తమ పార్టీ తరపున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తే ఆమెకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్ అవుతుందన్న ఉద్దేశంతో పార్టీ నేతలు ఉన్నట్టు సమాచారం.

అయితే తెలంగాణలో ఇప్పటివరకు సమంత రైతులకు చేనేత కార్మికులకు ఎంతో మద్దతుగా నిలబడి వారి కోసం పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా కూడా వ్యవహరించిన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే సమంత రాజకీయాలలోకి వస్తే తమ పార్టీకి మంచి కలుగుతుందనీ భావించినటువంటి బిఆర్ఎస్ నేతలు వచ్చే ఎన్నికలలో తన చేత ప్రచార కార్యక్రమాలను నిర్వహించడానికి సిద్ధమైందని తెలుస్తుంది.

అయితే ఈ వార్తలను సమంత అభిమానులు పూర్తిగా ఖండిస్తున్నారు. """/" / సమంతకు సినిమాలు అంటేనే చాలా ఆసక్తి సినిమాలలో ఉన్నత స్థానంలో ఉండాలన్నదే ఆమె కోరిక అంతేకాని రాజకీయాలలోకి రావాలన్న ఆసక్తి తనకు ఏమాత్రం లేదని అభిమానులు ఈ వార్తలను ఖండిస్తున్నారు.

ప్రస్తుతం సమంత మయోసైటిస్ వ్యాధి( Myositis )తో బాధపడుతూ ఈ వ్యాధి నుంచి బయటపడటం కోసం తనకెంతో ఇష్టమైనటువంటి సినిమా రంగానికి ఏడాది పాటు విరామం ప్రకటించార.

అలాంటిది రాజకీయాలలోకి వచ్చి ఎలా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారుసమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చినప్పటికీ పూర్తిగా తాను ఆరోగ్యంతో తిరిగి ఇండస్ట్రీలోకి రాబోతున్నారు కానీ రాజకీయాలలో( Politics ) కి మాత్రం అసలు రారు అంటూ ఈ వార్తలను ఖండిస్తున్నారు మరి సమంత రాజకీయాల గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్తల ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి అయితే ఈ వార్తలను అభిమానులు తప్పుపడుతున్నారు.

వీడియో వైరల్.. ఫన్నీ టమాటా రైమ్‭తో అదరగొట్టిన టీచర్లు!