అమ్మను కావాలని ఉంది… సంచలన వ్యాఖ్యలు చేసిన సమంత?
TeluguStop.com
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ( Samantha )!ప్రస్తుతం వరుస ప్రాజెక్టులకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.
ఈమె తాజాగా సిటాడెల్ ( Citadel ) అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమవుతుంది.అయితే ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఈమె తన పాత్ర గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తనకు అమ్మను కావాలని ఉందంటూ సమంత షాకింగ్ కామెంట్స్ చేశారు.తాను అమ్మగా ఉండడానికి ఇష్టపడతాను.
"""/" /
ఇందుకు ఆలస్యమైందని నేను అనుకోవటం లేదు.ప్రస్తుతం నేను నా జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను అంటూ ఈ సందర్భంగా సమంత చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా ఈమె రెండో పెళ్లి గురించి కూడా చర్చలకు కారణం అవుతున్నాయి.
నాగ చైతన్యను( Naga Chaitanya ) ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత కొన్ని కారణాలవల్ల విడాకులు తీసుకొని విడిపోయారు.
ఇలా విడాకుల తర్వాత నాగచైతన్య మాత్రం శోభిత( Sobhita ) ను ప్రేమించి పెళ్లికి కూడా సిద్ధమవుతున్నారు కానీ సమంత మాత్రం ఇప్పటివరకు సింగిల్గానే ఉన్నారు.
"""/" /
నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోవడంతో ఈమె కూడా రెండో పెళ్లికి సిద్ధమవుతుందని చాలామంది భావించారు కానీ నేను ఒక వ్యక్తిని ప్రేమించి ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను నాకు జీవితంలో మరో వ్యక్తి అవసరం లేదు అంటూ సమంత పలు సందర్భాలలో తెలియచేశారు అయితే తాజాగా ఈమె తనకు అమ్మను కావాలని ఉందని చెప్పడంతో ఈమె ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో తప్పనిసరిగా రెండో పెళ్లి చేసుకుంటారని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతమైతే ఈమె రెండో పెళ్లి గురించి ఎలాంటి ఆలోచన చేయకుండా పూర్తి దృష్టి తన కెరియర్ పైనే పెట్టారని తెలుస్తుంది.
జగన్ ఈ విషయంలో తప్పుచేశారా ?