సమంత కి కలిసిరాని సినిమాలు…ఎందుకిలా జరుగుతుంది..?
TeluguStop.com
ఒకప్పుడు స్టార్ హీరోలందరి తో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సమంత ప్రస్తుతం చేస్తున్న సినిమాలు అన్ని ప్లాప్ అవుతున్నాయి.
ఇక రీసెంట్ గా గుణశేఖర్ దర్శకత్వం లో తెరకెక్కిన శాకుంతలం( Sakunthalam ) సినిమా పరిస్థితి కూడా అలాగే మారింది.
శకుంతల, దుశ్యంతుడు ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ పౌరాణిక చిత్రంలో సమంత టైటిల్ రోల్ లో నటించింది .
గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి సర్వత్రా నెగిటివ్ రివ్యూలు, ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తున్నాయి.
సాధారణంగా సమంత నటించే హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు మంచి వసూళ్లనే రాబడుతుంటాయి.
టాక్ బావుంటే స్టార్ హీరోల రేంజ్ లో వసూళ్లు ఉన్నా ఆశ్చర్యం అవసరం లేదు.
"""/" / సమంత నుంచి చివరగా వచ్చిన యశోద చిత్రం మంచి విజయం దక్కించుకుంది.
అయితే సమంత సోలో చిత్రాలు ఎప్పుడూ 50 కోట్ల మార్క్ దాటలేదు.గుణశేఖర్( Gunasekhar ) సమంత క్రేజ్ ని నమ్ముకుని శాకుంతలం చిత్రానికి 80 నుంచి 100 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ చిత్ర బడ్జెట్ లో అనేక వార్తలు వస్తున్నాయి.కొందరు ఈ చిత్ర బడ్జెట్ 50 కోట్లే అని చెబుతున్నారు.
ఏది ఏమైనా శాకుంతలం 3 రోజుల షేర్ కనీసం 10 కోట్లు కూడా దాటలేదు.
దీనితో ఈ చిత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్ దిశగా పయనిస్తోంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఈ ఘోర పరాభవానికి అంతా గుణశేఖర్ నే బ్లేమ్ చేస్తున్నారు.గొప్ప సినిమా తీయాలనే కోరిక ఉంటే సరిపోదు.
దానికి తగ్గట్లుగా ప్రణాళిక, స్క్రిప్ట్ ఉండాలి అని అంటున్నారు.పురాణాల పేరుతో ఏం తీసినా ప్రేక్షకులు చూసేస్తారు అనుకునే వారికి శాకుంతలం చిత్రం కనువిప్పు అని కామెంట్స్ చేస్తున్నారు.
"""/" /
సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి ఇది పౌరాణిక చిత్రం.దుశ్యంతుడు, శకుంతల ప్రేమ కథ అనే విషయం తప్ప బజ్ పెరిగే విధంగా గుణశేఖర్ ఏమీ చేయలేకపోయారు.
ఈ చిత్రానికి కనీస ఓపెనింగ్స్ కూడా రాకపోవడానికి ఇదే కారణం.మంచి ట్రైలర్, పాటలు కూడా అందించకపోవడంతో శాకుంతలం చిత్రాన్ని ప్రేక్షకులు ఎవరూ పట్టించుకోలేదు.
యశోద చిత్రానికి సమంత అనారోగ్యం కారణంగా ప్రమోషన్స్ చేసింది చాలా తక్కువ.అయినప్పటికీ ఆ చిత్రాన్ని చూసేందుకు జనాలు ఎగబడ్డారు.
ఆ చిత్ర యూనిట్ మంచి ట్రైలర్ తో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచగలిగారు.కానీ శాకుంతలంలో ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైనప్పటి నుంచి గ్రాఫిక్స్ కార్టూన్ ని తలపించాయి.
దీనితో రాను రాను ఈ చిత్రంపై ఉన్న ఆసక్తి కూడా తగ్గిపోయింది .
దీనితో అర్హ నే నమ్ముకొని .ప్రచారం చేస్తున్నారు .
మరి అర్హ అయిన ఈ చిత్రానికి కొంత కలెక్షన్స్ పెంచుతుంది .
దిష్టి మొత్తం పోయింది బాబాయ్.. అల్లు అర్జున్ అరెస్టుపై మనోజ్ కామెంట్స్!