సమంత పుట్టినరోజుకు ఖుషి టీమ్ ఇచ్చిన సర్ప్రైజ్ అదేనా.. ఏడిపిస్తూ అలా ప్లాన్ చేశారా?

స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.సమంతా ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమంతా వెకేషన్ లో భాగంగా బిజీ బిజీగా ఉంది.

ఆ సంగతి పక్కన పెడితే సమంత తాజాగా నటించిన చిత్రం ఖుషి.టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఇందులో హీరోగా నటించిన విషయం తెలిసిందే.

శివనిర్వాణ ( Shiva Nirvana )దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

"""/" / ఇకపోతే హీరోయిన్ సమంతకు సంబంధించి ఒక వార్త చక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే ఖుషి సినిమా( Khushi Movie ) యూనిట్ చేసిన పనికి హీరోయిన్ సమంత ఎమోషనల్ అయిందట.

ఇంతకీ ఖుషి యూనిట్ సమంతా బాధపడేలా ఏం చేశారు అన్న విషయంలోకి వెళితే.

ఈ సినిమా షూటింగ్‌ గత సంవత్సరం కాశ్మీర్‌లో జరిగింది.అప్పుడే సమంత బర్త్‌డే కూడా వచ్చింది.

ఏదైనా సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చెయ్యాలని విజయ్‌ దేవరకొండ( Vijay Devarakonda ) అనుకున్నాడట.

ఆ విషయం గురించి డైరెక్టర్‌ శివ నిర్వాణతో మాట్లాడి చేసి పక్కాగా ప్లాన్‌ చేశారు.

ఒక రోజు రాత్రి ఒక ఇంపార్టెంట్‌ సీన్‌ చెయ్యాలంటూ డైరెక్టర్‌ శివ సమంతకు డైలాగ్‌ పేపర్‌ ఇచ్చాడు.

"""/" / దాన్ని తెగ ప్రాక్టీస్‌ చేసేసి, రిహార్సల్స్‌ కూడా చేసింది.అప్పుడు కెమెరా ముందుకు వచ్చి ఆ సీన్‌లో బాగా ఇన్‌వాల్వ్‌ అయిపోయి నటించింది.

యూనిట్‌లోని అందరికీ అది నిజంగా సినిమా కోసం తీసే సీన్‌ కాదని తెలుసు.

అందుకే అందరూ ఎంజాయ్‌ చేస్తూ చూస్తున్నారు.దానికి తగ్గట్టుగానే కెమెరామెన్‌ మురళి కూడా రకరకాల యాంగిల్స్‌ మారుస్తూ సీన్‌ని షూట్‌ చేస్తున్నాడు.

సీన్‌లో ఉన్న డెప్త్‌ వల్ల సమంతకు కన్నీళ్ళు ఆగలేదు.బోరున ఏడ్చేసింది.

తర్వాత అది నిజంగా సినిమా కోసం చేసింది కాదని తెలిసి హ్యాపీగా ఫీల్‌ అయిందట.

ఇలాంటి సర్‌ప్రైజ్‌ జీవితంలో తానెప్పుడూ చూడలేదని చెప్పిందట సమంత.అలా సమంత బర్త్‌డేకి ఒక స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేసి యూనిట్‌లోని అందరూ ఎంజాయ్‌ చేశారట.

వైరల్ వీడియో: సిక్సర్ వెళ్లిన బంతిని తీసుకుని పారిపోయిన అభిమాని