బరువు పెరగాలంటూ కామెంట్ చేసిన నెటిజన్.. సమంత ఇచ్చిపడేసిందిగా!

టాలీవుడ్( Tollywood ) స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత దాదాపుగా 15 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

గత కొంతకాలంగా సమంత సినిమాలకు దూరంగా ఉన్నా ఆమెకు ఉన్న క్రేజ్ మాత్రం మామూలు క్రేజ్ కాదు.

మరికొన్ని రోజుల్లో సిటాడెల్ ఇండియన్ వెర్షన్ హనీబన్నీతో సమంత ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఈ నెల 7వ తేదీన సిటాడెల్ ( Citadel )వెబ్ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా సమంత నెటిజన్లతో ముచ్చటించగా ఒక నెటిజన్ సమంతకు బరువు పెరగాలని సూచించారు.

ఈ ప్రశ్న తన దృష్టికి రావడంతో సమంత ఈ ప్రశ్న గురించి స్పందించారు.

మళ్లీ నాకు అదే ప్రశ్న ఎదురైందని ఆమె కామెంట్లు చేశారు.నా బరువు గురించి నాకు అంతా తెలుసని అమె పేర్కొన్నారు.

ప్రస్తుతం నేను కఠినమైన యాంటీ ఇన్ ఫ్లమేటరీ డైట్( Anti-inflammatory Diet ) లో ఉన్నానని సమంత తెలిపారు.

"""/" / ఈ డైట్ లో ఉండటం వల్ల నా బరువు ప్రస్తుతం నిర్ధిష్టంగానే ఉందని ఆమె పేర్కొన్నారు.

నా ఆరోగ్య పరిస్థితుల వల్ల నేను ఇలా మాత్రమే ఉండాలని ఆమె తెలిపారు.

దయచేసి ఇతరులను జడ్జ్ చేయడం ఆపాలని సమంత పేర్కొన్నారు.అవతలి వారిని కూడా జీవించనివ్వాలని ఇది 2024 అని సమంత వెల్లడించారు.

అవతలి వారిని సైతం జీవించనివ్వాలని సమంత చెప్పుకొచ్చారు. """/" / ప్లీజ్ గాయ్స్.

ఇది 2024 అంటూ సమంత( Samantha ) కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సమంత కెరీర్ ప్లాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి.మా ఇంటి బంగారం అనే క్రేజీ ప్రాజెక్ట్ లో సమంత నటించనున్నారు.

సమంత నటించనున్న ఈ ప్రాజెక్ట్ పై నెమ్మదిగా అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.