స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్లే సమంత అలా మారిపోయారా… అసలు విషయం చెప్పిన నటి!
TeluguStop.com
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సమంత ( Samantha ) ప్రస్తుతం సినిమాలకు విరామం ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.
ఇలా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈమె నటించిన ఖుషి సినిమా( Khushi Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది ఇక ఈ సినిమా తర్వాత సమంత ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వలేదు.
ప్రస్తుతం సమంత కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి నేపథ్యంలో సినిమాలకు దూరంగా ఉంటూ పూర్తిగా తన ఆరోగ్యం మెరుగుపరుచుకోవడం కోసం కష్టపడుతున్నారు.
"""/" /
ఇలానటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు అయితే తాజాగా ఈమె ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.
ఈ సందర్భంగా ఎంతోమంది ఈ సినిమాల గురించి అలాగే వ్యక్తిగత విషయాల గురించి కూడా ప్రశ్నించారు.
"""/" /
ఇక సమంతను కొందరు నెటిజన్స్ ప్రశ్నిస్తూ ఆమె నుంచి సమాధానాలు రాబట్టారు.
ఈ క్రమంలోనే ఒక నెటిజన్ మాత్రం మీ చర్మం చాలా కాంతివంతంగా తయారైంది ఇలా మారడానికి కారణం ఏంటి అంటూ కూడా ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు సమంత సమాధానం చెబుతూ తాను ఎలాంటివి ఉపయోగించడం లేదు అయితే మయోసైటిస్ ( Myositis ) వ్యాధితో బాధపడుతున్నటువంటి తనకు ఎక్కువగా స్టెరాయిడ్స్ ( Steroids ) ఇవ్వడం వల్ల తన స్కిన్ ఇలా కాంతివంతంగా తయారయింది.
ఇక తాను చర్మ సంబంధ సమస్యలతో ఇబ్బందిపడ్డా.విపరీతమైన పిగ్మెంటేషన్ వచ్చింది.
చిన్మయి నన్ను గ్లాసీగా చేస్తానని చెప్పింది.చిన్మయి ఎక్కడున్నావ్ అంటూ ఈ సందర్భంగా సమంత అభిమానీ అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ చేసినటువంటి ఈ కామెంట్ వైరల్ అవుతుంది
.
స్టీవ్ జాబ్స్ భార్య మహాకుంభమేళాలో ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు!