ఆ డైరెక్టర్లతో పని చేయడం కష్టం.. ఏడ్చేశాను.. సమంత షాకింగ్ కామెంట్స్ వైరల్!

ఇటీవల కాలంలో టాలీవుడ్ హీరోయిన్ సమంత పేరు తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో వినిపిస్తూనే ఉంది.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న సమంత(Samantha) తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది.

తాజాగా కూడా మరొకసారి వార్తల్లో నిలిచింది సమంత.తన సోషల్ మీడియా ఖాతాలో బాలీవుడ్ దర్శక ద్వయం అయిన రాజ్ అండ్ డీకే ను ఉద్దేశించి ఒక పోస్ట్ ని రాసకొచ్చింది.

వారి కాంబోలో వచ్చిన తొలి ప్రాజెక్ట్‌ ది ఫ్యామిలీ మ్యాన్‌ 2 (the Family Man2)సిరీస్‌ షూట్‌ రోజులను గుర్తు చేసుకున్నారు.

"""/" / షూట్‌ లో తాను బాగా ఏడ్చేశానని ఆమె తెలిపారు.ఈ సందర్భంగా ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విధంగా రాసుకొచ్చింది.

రాజ్ అండ్‌ డీకేతో(Raj And Dk) కలిసి పని చేయడంతో పోలిస్తే తెలుగు, తమిళం చిత్రాల్లో వర్క్‌ చేయడం చాలా ప్రశాంతంగా ఉంటుంది.

సాధారణంగా నా సినిమాల్లో ఒక రోజుకు రెండు లేదా మూడు సీన్స్‌ షూట్‌ చేసేవారు.

కానీ ఇక్కడ అలా కాదు.ఒక గంటలోనే ఆ సీన్స్‌ చిత్రీకరిస్తారు.

రాజీ పాత్రకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు, ఫైట్‌ సీక్వెన్స్‌ లను మొదటి షెడ్యూల్‌ లోనే షూట్‌ చేశారు.

రెండు రోజుల తర్వాత ఏడ్చుకుంటూ మా మేనేజర్‌ కు ఫోన్‌ చేసాను.నా వల్ల కావడం లేదు.

"""/" / ఇంటికి వచ్చేస్తానని చెప్పాను.రానురాను వారి వర్కింగ్‌ స్టైల్‌కు అలవాటు పడ్డాను.

సిటడెల్‌ : హనీబన్నీ(Citadel : Honeybunny) కోసం మరోసారి ఈ టీమ్‌తో కలిసి వర్క్‌ చేయడం నాకు నచ్చింది అని సమంత రాసుకొచ్చింది.

ఇకపోతే ఈ సందర్భంగా సమంత చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాగా సమంత నటించిన సిటాడెల్ సిరీస్ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.

హిందీలో 3 సినిమాల డీల్ కు ఓకే చెప్పిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. అసలేమైందంటే?