సమంతతో మొదలు పెట్టిన వెంటనే అప్డేట్‌ ఇచ్చిన రౌడీ స్టార్‌

సమంతతో మొదలు పెట్టిన వెంటనే అప్డేట్‌ ఇచ్చిన రౌడీ స్టార్‌

రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్ గా నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్ ఎట్టకేలకు పునః ప్రారంభం అయ్యింది.

సమంతతో మొదలు పెట్టిన వెంటనే అప్డేట్‌ ఇచ్చిన రౌడీ స్టార్‌

ఈ సినిమా యొక్క షూటింగ్ ఎప్పుడో పూర్తి అవ్వాల్సి ఉన్నా కూడా సమంత అనారోగ్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.

సమంతతో మొదలు పెట్టిన వెంటనే అప్డేట్‌ ఇచ్చిన రౌడీ స్టార్‌

శివ నిర్వాన దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే.సమంత అనారోగ్య సమస్యల నుండి బయట పడ్డ నేపథ్యంలో షూటింగ్ కు జాయిన్ అయ్యింది.

సమంత కోసం ఇన్నాళ్లు వెయిట్‌ చేస్తున్న యూనిట్‌ సభ్యులు వెంటనే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టడమే కాకుండా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్‌ ను ఇవ్వడం జరిగింది.

ఈ సినిమా మజిలీ సినిమా తరహాలోనే భార్య , భర్తల మధ్య జరిగే ఆసక్తికర సంఘటనలు మరియు మాంగళ్య బంధం గురించి చూపించబోతున్నారట.

ప్రస్తుతం సినిమా యొక్క కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందనే వార్తలు వస్తున్నాయి. """/" / ఇప్పటి వరకు శివ నిర్వాన నుండి వచ్చిన అన్ని సినిమాలు కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి.

కనుక ఈ సినిమా కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం అందరిలో ఉంది.

ప్రస్తుతం షూటింగ్‌ కు సంబంధించిన హడావుడి ఉన్న నేపథ్యంలో త్వరలోనే కీలక అప్డేట్‌ ను అధికారికంగా ఇవ్వబోతున్నారట.

అంతే కాకుండా సమంత మరియు విజయ్ దేవరకొండ లపై షూట్‌ చేస్తున్న స్టిల్స్ ను విడుదల చేయబోతున్నారు.

ఇక ఉగాది కానుకగా టీజర్ ను కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

మొత్తానికి కాస్త ఆలస్యం అయినా కూడా ఏమాత్రం తగ్గకుండా బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకులను ఖుషి చేసేందుకు మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారు.

సమంత ఈ సినిమా మాత్రమే కాకుండా హిందీలో వరుసగా సినిమాలు మరియు సిరీస్ లను చేస్తోంది.

విజయ్ దేవరకొండ ఇటీవల గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు ఓకే చెప్పాడు.

ప్రభాస్ ప్రశాంత్ వర్మ కాంబోలో సినిమా వచ్చేది అప్పుడేనా..?