రౌడీ స్టార్ కెరీర్ బెస్ట్… ఇక వెనక్కి తిరిగి చూసేది లేదు!
TeluguStop.com
చిన్న చిత్రాలతో కెరీర్ ను ఆరంభించిన విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) అర్జున్ రెడ్డి మరియు గీత గోవిందం సినిమా లతో భారీ విజయాలను సొంతం చేసుకున్నాడు.
ఆ రెండు సినిమా లు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అంటూ అభిమానులు ఈయన్ను నెత్తిన పెట్టుకునేలా చేశాయి అనడంలో సందేహం లేదు.
మొదటి నుండి కూడా విజయ్ దేవరకొండ ఒక విభిన్నమైన తీరు తో ముందుకు వెళ్తున్నాడు.
అందుకే విజయ్ దేవరకొండకు గీతా గోవిందం సినిమా నుండి మొన్నటి వరకు ఫ్లాప్స్ పడ్డా కూడా నిలబడ్డాడు.
లైగర్ వంటి డిజాస్టర్ తర్వాత ఏ హీరో అయినా కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది.
కానీ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కి మాత్రం ఎక్కువ సమయం పట్టలేదు.
తాజాగా ఖుషి సినిమా( Khushi Movie) తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
"""/" /
బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను దక్కించుకున్నాడు.సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కి శివ నిర్వాన( Shiva Nirvana ) దర్శకత్వం వహించాడు.
అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఖుషి సినిమా వంద కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి ఉండేది.
కానీ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఖుషి సినిమా కు నిరాశ మిగిల్చాయి.అయినా కూడా ఖుషి సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ బెస్ట్ అన్నట్లుగా నిలిచింది అనడంలో సందేహం లేదు.
అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమా లకు ఏమాత్రం తీసి పోకుండా ఖుషి సినిమా ఉంది.
మరో అయిదు ఆరు సంవత్సరాల పాటువిజయ్ దేవరకొండ వెనక్కి తిరిగి చూసుకోకుండా దూసుకు పోయే అవకాశాలు ఉన్నాయి.
ఈ రేంజ్ లో విజయాలను సొంతం చేసుకోవడం తో ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు.
రౌడీ ఫ్యాన్స్ కి చాలా సంవత్సరాల తర్వాత ఖుషి దక్కింది.ఒక వైపు విజయ్ దేవరకొండ కి భారీ విజయం దక్కడం తో పాటు మరో వైపు సమంత కూడా సరిగ్గా అవసరం అయిన సమయంలో ఈ సక్సెస్ ను దక్కించుకుంది.
కనుక ఆమె కూడా మరో నాలుగు అయిదు సంవత్సరాల పాటు వరుస సినిమాలు చేసుకునే అవకాశాలు లేకపోలేదు.
ప్రభాస్ కి అసలైన పోటీ ఇచ్చే స్టార్ హీరోలు వీళ్లేనా..?