గొప్ప విజ్ఞానంతో గొప్ప బాధ్యతలు… పవన్ కళ్యాణ్ పై సమంత విశేష్ లో ఎంత అర్ధం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

పవన్ పుట్టిన రోజు ఫ్యాన్స్ కి ఒక పండగ రోజని చెప్పాలి.ఈ పుట్టిన రోజు సందర్భంగా గత వారం రోజుల నుంచి జనసేనాని కార్యకర్తలు, పవన్ ఫాలోవర్స్ రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు.

ఇందులో భాగంగా కరోనా బాధితుల సహాయార్ధం హాస్పిటల్స్ కి ఆక్సిజన్ గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేశారు.

సొంత డబ్బులు ఖర్చు పెట్టి జనసేనాని కార్యకర్తలు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేశారు.

ఇలాంటి సేవా కార్యక్రమాలతో ఆయన సిద్ధాంతాలని జనంలోకి తీసుకెళ్ళడానికి పవన్ అభిమానులు ముందడుగు వేస్తారు.

అలాగే పుట్టిన రోజు నాడు ఫ్యాన్స్, సెలబ్రిటీ విషెస్ తో సోషల్ మీడియా హోరేత్తుతుంది.

ఈ రోజు అంతా పవన్ కళ్యాణ్ పేరు, అతని సినిమాలు ట్రెండింగ్ లో ఉంటాయి.

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ అంటే అభిమానించే సెలబ్రిటీలు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు.

అతని ఆలోచనలని, అభిప్రాయాలని గొప్పగా చూస్తూ ఉంటారు.అలాంటి వారిలో స్టార్ హీరోయిన్ సమంత కూడా ఉంది.

ఈ భామ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు విషెస్ అందరికంటే ముందుగానే చేసింది.

ఈ సందర్భంగా ఆమె పెట్టిన పోస్ట్ పవన్ కళ్యాణ్ మీద, ఆయన ఆలోచనల మీద సమంతకి ఎంత నమ్మకం ఉందో అనే విషయం స్పష్టం అవుతుంది.

అతనిని ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నట్లు అనిపిస్తుంది.నిజంగా అద్భుతమైన వ్యక్తి పవన్ కల్యాణ్ సర్ కు వెరీ హ్యాపీ బర్త్ డే.

గొప్ప విజ్ఞానంతో గొప్ప బాధ్యతలు వస్తాయి, మీకు ఎప్పటికీ మంచి ఆరోగ్యం, ఘనమైన సంతోషం దక్కాలని ఆశిస్తున్నట్టు తెలిపింది.

మొత్తానికి సమంత పెట్టిన ట్వీట్ పవన్ కళ్యాణ్ అభిమానులకి మాత్రం మంచి ఉత్సాహం అందించింది అని చెప్పాలి.

అమ్మో! ప్రపంచంలో 43 లక్షల రోబోలు పని చేస్తున్నాయట.. ఆ దేశంలోనే హైయ్యెస్ట్?