సమంత అక్కినేని బ్యూటీ సీక్రెట్ ఇదేనట?

అందం, అభినయంతో అక్కినేని సమంత రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్ల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

నాగచైతన్యతో పెళ్లి తర్వాత అటు ఒకవేపు అక్కినేని కోడలిగా, మరోవైపు నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటిస్తూ సమంత మంచి పేరు సంపాదించుకోవడంతో పాటు గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

లాక్ డౌన్ సమయంలో తన సీక్రెట్స్ అభిమానులతో పంచుకుంటున్న సామ్ తాజాగా తన్ బ్యూటీ సీక్రెట్ గురించి చెప్పుకొచ్చారు.

సమంత సినిమాల్లోకి అడుగుపెట్టి 12 సంవత్సరాలైనా ఆమె అందం ఏ మాత్రం తగ్గలేదు.

సాధారణంగా పెళ్లైన తర్వాత హీరోయిన్లకు అవకాశాలు తగ్గుతాయనే గ్యాసిప్ ప్రచారంలో ఉంది.అయితే సమంత మాత్రం అందుకు అతీతం అనే చెప్పాలి.

తన బ్యూటీ గురించి సామ్ మాట్లాడుతూ తాను యోగాతో పాటు ఫేస్ మసాజర్ తో మసాజ్ చేసుకోవడమే తన చర్మ సౌందర్యానికి కారణమని ఆమె పేర్కొంది.

ఫేస్ మసాజర్ వల్ల కలిగే ఉపయోగాలను కూడా సమంత వివరించి చెప్పింది.ముఖాన్ని ఫేస్ మసాజర్ తో మసాజ్ చేసుకుంటే ముఖం కాంతివంతంగా కనిపిస్తుందని.

ముఖంపై ఉన్న చర్మం ఎంతో మృదువుగా మారుతుందని తెలిపింది.సమంత కొన్ని రోజుల క్రితం తన ఫ్యాషన్ లేబుల్ గురించి చెప్పిన సంగతి తెలిసిందే.

ఈ సంవత్సరం సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన జాను సినిమా విడుదల కాగా ఆ సినిమా ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోలేదు.

ప్రస్తుతం సామ్ అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమయ్యే ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది.

తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఒక హర్రర్ జోనర్ చిత్రంలో నటించడానికి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

కన్నడ సినిమా దియా రీమేక్ లో కూడా సమంత నటించనుందని తెలుస్తోంది.

లిక్కర్ కేసులో సిసోడియాకు బెయిల్ తిరస్కరణ..!