చెవులు కుట్టించుకున్న సమంత అక్కినేని… ఫోటో వైరల్..!
TeluguStop.com
టాలీవుడ్ అగ్రతార సమంత అక్కినేని కరోనా కాలం లో తన ఖాళీ సమయాన్ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకొని కూరగాయలను, ఆకుకూరలను పండించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
ఈషాక్రియ యోగా కూడా చేసి తన ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుచుకున్నారు.దాదాపు నాలుగు నెలల పాటు ప్రతిరోజూ ఇన్ స్టాగ్రామ్ లో చురుకుగా ఉన్న సమంత అక్కినేని 10 మిలియన్ల ఫ్యాన్ ఫాలోయింగ్ మైలురాయిని మొదటి రెండు నెలల్లో చేధించగా.
మిగిలిన రెండు నెలల కాలంలో 11 మిలియన్ల మైలురాయిని కూడా చేధించి అరుదైన రికార్డును నెలకొల్పారు.
రానా-మిహీక పెళ్లి వేడుకలో పాల్గొన్న సమంత అక్కినేని చేనేత వస్త్రాలు ధరించి చేనేత కార్మికులు నేసిన వస్త్రాలు చాలా బాగున్నాయని అందరూ కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేసి తన సహృదయాన్ని చాటుకున్నారు.
ఇటీవల ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఫోటో షేర్ చేయగా.
అందులో సమంత అక్కినేని ఆకుపచ్చ రంగు డ్రెస్ ధరించి అందరి కళ్ళను తనవైపే తిప్పుకున్నారు.
అయితే తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక ఫోటో షేర్ చేశారు.
ఆ ఫోటోలో సమంత తన ఎడమ చెవిపై కొత్తగా కుట్టించుకున్న చెవి దిద్దులు చూపించారు.
సమంతా ఈ ఫోటోకి 'న్యూ పైర్చింగ్స్' అని కాప్షన్ జోడించారు.ఈ ఫోటో అప్లోడ్ చేసిన అరగంట సమయంలోనే రెండు లక్షల మంది లైక్ చేశారు.
ఇకపోతే సమంత అక్కినేని ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో కనిపించనున్నారు.
నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలలో నటిస్తున్న కాతు వాకులా రేండు కదల్ సినిమాలో కూడా సమంత నటించారు.
విమానంపై పడ్డ పిడుగు.. చివరకు? (వీడియో)