ఆ విషయంలో సమంత ఇప్పటికీ నెంబర్ 1?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్స్ అయినటువంటి కాజల్, తమన్నా, సమంత, అనుష్క శెట్టి వంటివారు సీనియర్ హీరోయిన్స్ లిస్ట్ లోకి వెళ్లగా.

ఆ తర్వాత రష్మిక, రకుల్, నేడు కృతి సెట్టి హవా కొనసాగుతుందని చెప్పవచ్చు.

కాజల్ అగర్వాల్ సమంత సీనియర్ లిస్ట్ లోకి వెళ్ళినప్పటికీ, వివాహం చేసుకున్నప్పటికీ ఏ మాత్రం సినిమాల విషయంలో వెనకడుగు వేయకుండా వరుస సినిమా అవకాశాలను అందుకుని తమదైన శైలిలో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.

ఈ విధంగా సినిమాలతో బిజీగా ఉండటం కాకుండా తమ గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ యువతను సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రముఖ సర్వే సంస్థ ఆర్మాక్స్ మీడియా ఈ ఏడాది సెప్టెంబర్ నెలకు టాప్ 10 లిస్టులో ఉన్నటువంటి హీరో హీరోయిన్ల పేర్లను విడుదల చేసింది.

మరి ఈ లిస్టు లో మన సినీతారలు ఎవరు ఏ స్థానంలో ఉన్నారు అనే విషయానికి వస్తే.

వీరందరిలో సమంత ఇప్పటికీ నెంబర్ వన్ స్థానంలోనే కొనసాగుతోంది.మొదటి స్థానంలో సమంత అవకాశం దక్కించుకోగా 2 స్థానంలో వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ ఉన్నారు.

వీరిద్దరూ సీనియర్ హీరోయిన్స్ అయినప్పటికీ పెళ్లి చేసుకున్న సినిమాల పరంగా మొదటి రెండు స్థానాలు దక్కించుకోవడం గమనార్హం.

"""/"/ ఈ సర్వేలో భాగంగా ఏమాత్రం ఫామ్ లో లేనటువంటి అనుష్క శెట్టి 3 స్థానంలో ఉన్నారు.

రష్మిక మందన్నా 4 వ స్థానంలో ఉండగా మిల్క్ బ్యూటీ తమన్నా 5 వ స్థానాన్ని దక్కించుకున్నారు.

6 వ స్థానంలో ఉత్తమ జాతీయ నటి పురస్కారాన్ని అందుకున్న మహానటి కీర్తి సురేష్ ఉన్నారు.

7 వ స్థానంలో బుట్టబొమ్మ పూజా హెగ్డే ఉండగా, 8 వ స్థానంలో రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నారు.

9 వ స్థానంలో రాశి ఖన్నా ఉండగా,10 వ స్థానంలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఉన్నారు.

ఆర్మాక్స్ మీడియా వెల్లడించిన సర్వే ప్రకారం ఇప్పటికీ సమంత మొదటి స్థానంలో ఉండడంతో సామ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అలసత్వం వహించిన అధికారులపై చర్యలు..: మంత్రి తుమ్మల