ఎన్టీఆర్ సినిమాలో స్పెషల్ సాంగ్ కు సై అంటున్న స్టార్ హీరోయిన్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr ) ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు.

ఇలా పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందిన ఈయన ఇటీవల దేవర సినిమా (Devara Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో సక్సెస్ అందుకున్నారు.

ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఎన్టీఆర్ దేవర సినిమా ద్వారా మరో హిట్ అందుకుని అభిమానులను సందడి చేశారు.

ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి ప్రాజెక్ట్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) డైరెక్షన్లో చేయబోతున్న సంగతి తెలిసిందే.

"""/" / ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమాకు సంబంధించి పూజ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి.

త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి.ఇదిలా ఉండగా తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సినిమా కూడా ఫాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాలో ఎన్టీఆర్ (NTR)సరసన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్(Beauty Rukmini Vasant) హీరోయిన్గా నటించబోతున్నారని సమాచారం.

"""/" / ఇక ఈ సినిమాలో ప్రశాంత్ నీల్(prashanth Neel) ఓ స్పెషల్ సాంగ్ గట్టిగానే ప్లాన్ చేశారని తెలుస్తోంది.

ఇటీవల కాలంలో స్పెషల్ సాంగ్స్ లో స్టార్ హీరోయిన్స్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఓ స్టార్ హీరోయిన్ సెలెక్ట్ చేశారని తెలుస్తుంది.

మరి ఆ స్టార్ హీరోయిన్ ఎవరనే విషయాన్నికొస్తే ఆమె మరెవరో కాదు సమంత (Samantha) అని సమాచారం.

సమంత ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

అయితే ఇదివరకే అల్లు అర్జున్ (Allu Arjun)హీరోగా నటించిన పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి సందడి చేసిన సమంత మరోసారి ఎన్టీఆర్ కోసం స్పెషల్ సాంగ్ చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.

మూవీలను లీక్ చేసేది ఎవరో తెలిస్తే కంగు తింటారు..