సమ్మె సన్నద్ధమైన సమగ్ర శిక్ష ఉద్యోగులు
TeluguStop.com
నల్లగొండ జిల్లా: కేజీబీవీ, ఎంఆర్సీ,ఐఈఆర్సీ కాంప్లెక్స్,ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నుండి మొదలుపెట్టే నిరసన పోరాటానికి సన్నద్ధం అయినట్లు సమగ్ర శిక్షణ ఉద్యోగులు తెలిపారు.
డిసెంబర్ 10 నుండి రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరవధిక సమ్మెకు వెళ్తున్న క్రమంలో సోమవారం మండల విద్యాధికారి రామవత్ నాగేశ్వరరావుకు ఉద్యోగులు సమ్మె నోటీసు అందజేశారు.
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ 2022 సెప్టెంబర్ 13 న వరంగల్ జిల్లా కేంద్రంలో
నిరసన దీక్ష చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు దీక్ష శిభిరం వద్దకు వచ్చిన నాటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు,నేటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తమకు మద్దతు తెలుపుతూ మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రాష్ట్ర సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్దికరిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీని తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కెజిబివి ఉపాధ్యాయులు గొట్టిముక్కల సుందరి, సుజిత,నస్రీన్,స్వప్న,ఎంఆర్సీ దారం శ్రీనివాస్, త్రివేణి,కాంప్లెక్స్ శివకర్, జమీర్ హుస్సేన్, ఆంజనేయులు,పార్ట్ టైమ్ ఇన్స్ట్రక్టర్స్ పాల్గొన్నారు.
ఆట మొదలెట్టిన డొనాల్డ్ ట్రంప్ .. 7.25 లక్షల మంది భారతీయులు ఇంటికే?