హ్యాపీ బర్త్‌డే అంటూ పాడిన స్టూడెంట్స్.. ఇబ్బందిగా ఫీలైన టెక్ దిగ్గజం..??
TeluguStop.com
ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్( Sam Altman ) గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు.
చాట్‌జీపీటీ( ChatGPT ) లాంచ్ తో ఆయన ఇంటర్నెట్ ప్రపంచంలో ఒక సెన్సేషన్ గా మారారు.
ఏప్రిల్ 22న ఈ టెక్ దిగ్గజం పుట్టినరోజు జరుపుకున్నారు.అయితే ఆయనకు రీసెంట్‌గా స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో( Stanford University ) ఊహించని బర్త్‌డే సర్‌ప్రైజ్ లభించింది.
స్టాన్‌ఫోర్డ్ లెక్చరర్ రవి బెలానీతో( Ravi Belani ) ఆయన సంభాషణ జరుగుతున్న సమయంలో, ఒక గుంపు విద్యార్థులు ఆయన కోసం "హ్యాపీ బర్త్‌డే" అంటూ పాట పాడారు.
బహిరంగంగా పుట్టినరోజు జరుపుకోవడానికి ఇష్టపడని ఆల్ట్‌మన్‌కు ఈ సందర్భం కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది.
"""/" /
ఈ పుట్టినరోజు పాట వీడియోను అలెన్ నలియత్ అనే మూడవ సంవత్సరం కంప్యూటర్ సైన్స్ విద్యార్థి సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
విద్యార్థులు పాట పాడటమే కాకుండా, ఆల్ట్‌మన్ వెనుక ఉన్న స్క్రీన్‌పై "హ్యాపీ బర్త్‌డే, సామ్" అనే సందేశం కూడా డిస్‌ప్లే చేశారు.
కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ, ఆల్ట్‌మన్ స్పందిస్తూ, "ఇది చాలా ఆసక్తికరంగా లేదు" అని అన్నారు.
2005లో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేయకుండా సామ్ ఆల్ట్‌మన్ బయటకు వచ్చారు.
"""/" /
స్టాన్‌ఫోర్డ్ డ్రాపౌట్ అయినా అందులో డిగ్రీ చేసిన వారి కంటే ఎక్కువ తెలివిని ప్రదర్శిస్తూ సూపర్ బాపులరయ్యారు.
గ్రీన్-ఎనర్జీ స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా వార్తల్లో నిలిచారు.డేటా సెంటర్లపై దృష్టి పెట్టే ఆయన తాజా సంస్థ ఎక్సోవాట్.
అయితే సామ్ ప్రవర్తన తెలుసుకొని చాలామంది అవాక్కవుతున్నారు.ఇంట్రోవర్ట్ పర్సన్స్ పార్టీలకు సెలబ్రేషన్స్ కు ఇలానే స్పందిస్తారని కొంతమంది అంటున్నారు.
విద్యార్థులు తెలియక పుట్టినరోజు పాట పాడినట్లు ఉన్నారని మరికొందరు అన్నారు.
ఎముకల బలహీనత, రక్తహీనత రెండిటికీ చెక్ పెట్టే బెస్ట్ డ్రింక్ ఇది!