సౌత్ సినిమాలు బాలీవుడ్ లో హిట్.. కానీ మా సినిమాలు మాత్రం: సల్మాన్ ఖాన్ వైరల్ కామెంట్స్

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు ఆర్ఆర్ఆర్.ఈ సినిమా పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది.

పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లో కూడా సూపర్ హిట్ టాక్ ను అందుకునే బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఒక్క హిందీ లోనే ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్లను సాధించింది.

దీనితో బాలీవుడ్లో పలువురు సెలబ్రిటీలు సైతం ఈ సినిమాకు ఫిదా అయ్యాము అంటూ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి లను మెచ్చు కుంటున్నారు.

ఈ సందర్భంగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలు చేశాడు.ప్రస్తుతం సల్మాన్ ఖాన్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

అయితే చిరంజీవితో కలిసి పని చేయడం తనకు ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తోంది అని తెలిపారు సల్మాన్ ఖాన్.

చిరంజీవితో తనకు చాలా కాలం నుంచే పరిచయం ఉందని, చిరంజీవి తనకు ఒక మంచి ఫ్రెండ్ అని.

తన తనయుడు రామ్ చరణ్ కూడా తనకు మంచి స్నేహితుడు అని, రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాల్లో అద్భుతంగా నటించాడు అని తెలిపారు సల్మాన్ ఖాన్.

"""/" / ఇక ఆర్ఆర్ఆర్ మంచి విజయం సాధించినందుకు గాను రామ్ చరణ్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నాను అని తెలిపారు సల్మాన్ ఖాన్.

రామ్ చరణ్ ని చూస్తుంటే తనకు గర్వంగా ఉందని,కెరీర్  పరంగా బాగా రాణిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని తెలిపారు.

అదే విధంగా మాట్లాడుతూ దక్షిణాది సినిమాలు హిందీలో బాగా ఆడతాయి కానీ, మా సినిమాలు మాత్రం తెలుగులో పెద్దగా ఆడవు.

అది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అని తెలిపారు సల్మాన్ ఖాన్.నిజంగానే తెలుగు సినిమాలు హిందీలో బాగా సక్సెస్ అవుతాయి అని చెప్పుకొచ్చాడు సల్మాన్ ఖాన్.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఆర్ఆర్ఆర్ మేనియానే కనిపిస్తోంది.

జాతీయ రాజకీయాలపై చంద్రబాబు ఆసక్తి .. అందుకే ఆ రాష్ట్రంపై ఫోకస్ ?