సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ ట్రైలర్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు రిలీజ్ కాబోతుందంటే?

బాలీవుడ్ స్టార్ హీరోల్లో సల్మాన్ ఖాన్( Salman Khan ) ఒకరు.ఈయన సినిమా వస్తుంది అంటే హిందీ ఆడియెన్స్ లో పూనకాలే అని చెప్పాలి.

ఒకప్పుడు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన సల్మాన్ కు ఈ మధ్య ఆ రేంజ్ హిట్ అనేది దక్కడం లేదు.

ఒక వైపు సీనియర్ హీరో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ 1000 కోట్ల ప్రాజెక్టులను బాలీవుడ్ ఇండస్ట్రీకి అందిస్తున్నాడు.

పఠాన్, జవాన్ సినిమాలతో ఒకే ఏడాదిలో రెండు వెయ్యి కోట్ల ప్రాజెక్టులను అందించి బాలీవుడ్ పరువు కాపాడాడు.

అయితే సల్మాన్ ఖాన్ కూడా ఆ రేంజ్ హిట్ అందుకోవాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మరి ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ తాజాగా నటించిన లేటెస్ట్ మూవీ ''టైగర్ 3'' రిలీజ్ కు సిద్ధం అయ్యింది.

ఈ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. """/" / సల్మాన్ నటించిన అన్ని చిత్రాల్లో కంటే టైగర్ ఫ్రాంచైజీకి సపరేట్ గా క్రేజ్ అనేది ఉంది.

అందుకే టైగర్ 3( Tiger 3’ ) ఎప్పుడు వస్తుందా ఎప్పుడు రికార్డులను క్రియేట్ చేస్తుందా అని సల్లూ భాయ్ ఫ్యాన్స్ చూస్తున్నారు.

ఈ సినిమాపై ఇప్పటికే భారీ క్రేజ్ ఉంది.నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ తన స్పై యూనివర్స్ లో టైగర్ 3 ను చేర్చడంతో బాలీవుడ్ లో అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.

"""/" / మరి టైగర్ 3 నుండి తాజాగా మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.

దీపావళి కానుకగా రిలీజ్ కాబోతుండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు.

ఈ క్రమంలోనే టైగర్ 3 ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అనే విషయం తెలిపారు.

అక్టోబర్ 16న ఈ ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.

కత్రినా కైఫ్( Katrina Kaif ) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను మనీష్ శర్మ తెరకెక్కించాడు.

అంతేకాదు ఈ సినిమాలో పఠాన్ గా షారుఖ్ ఖాన్ కనిపించనుండడంతో ఎలా ఉంటుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.