నేను గుండు కొట్టించుకోవాలంటే సెట్లో అందరు కొట్టించుకోవాలి : సల్మాన్

ఏ సినిమా అయినా విజయ వంతం అవ్వాలంటే దర్శకుడు నిర్మాత మాత్రమే కాదు హీరో తో పాటు ప్రతి ఒక్కరు ఎంతో కష్ట పడాలి.

చాల రోజులుగా హీరో గా విక్రమ్ కి స్టార్డం తీసుకచ్చిన సేతు సినిమా గురించి ఎన్నో ఆర్టికల్స్ చదువుతూనే ఉన్నాం.

ఈ సినిమా కోసం దర్శకుడు బాల చేయని పని లేదు, పడని కష్టం లేదు.

విక్రమ్ సైతం ఎన్నో రోజులు ఈ పత్రం కోసం పిచ్చి వాడిలా శ్రమించాడు.

తిండి తినకుండా, ఎన్నో సార్లు కళ్ళు తిరిగి పడిపోయాడు.ఒకసారి చెత్త కుప్పలో కూడా మైకం తో పడిపోయాడు.

చాల రోజులు పట్టింది ఈ సినిమా తర్వాత విక్రమ్ కి కోలుకోవడానికి.ఇక ఈ సినిమాను తెలుగు లో రాజశేఖర్ చాల ఆడుతూ పాడుతూ చేసేసారు కానీ కన్నడ లో సుదీప్ కిచ్చ సైతం చాల కష్ట పడ్డాడు.

సెట్ లో ఒక జూనియర్ ఆర్టిస్ట్ కి ఇచ్చిన మర్యాద కూడా అతడికి ఇవ్వకుండా అవమానించిన సినిమా పై ఉన్న నమ్మకం తో కష్టపడి పని చేసి సినిమా విజయవంతం కావడం తో స్టార్ హీరో అయిపోయాడు.

కానీ ఈ అందరి కంటే బిన్నం గా ఈ చిత్రం హిందీ రీమేక్ లో సల్మాన్ ఖాన్ ప్రవర్తించాడు.

"""/" / మాములుగా ఎంతో కొంత అహం ఉండే హీరోల బ్యాచ్ కాబట్టి సేతు సినిమాను హిందీ లో రీమేక్ చేయడానికి సల్మాన్ ఒప్పుకున్నా కొన్ని కండిషన్స్ పెట్టాడు.

మరి ముఖ్యంగా ఈ పాత్ర కోసం హీరో గుండు కొట్టించుకోవాలి.కానీ సల్మాన్ ఖాన్ గుండు కొట్టించుకోవడానికి మొదట ఒప్పుకోలేదు.

ఆ తర్వాత ఒప్పుకున్నా అందుకోసం కొన్ని కండిషన్స్ పెట్టాడు.తాను గుండు కోటించుకోవాలంటే సెట్ లో ఉన్నవాళ్ళంతా కూడా గుండు కొట్టించుకోవాలని చెప్పడం తో అంత మొదట షాక్ అయినా ఆ తర్వాత గుండు కొట్టించుకోక తప్పలేదు.

"""/" / ఒకసారి ఇంటర్వ్యూ లో కన్నడ సుదీప్ ఈ విషయాన్నీ చెప్తూ బాధ పడ్డాడు.

ఈ సినిమా కోసం పని చేసిన వారిలో అత్యంత ఎక్కువ అవమానాలకు గురయ్యింది నేనే అంటూ చెప్పుకోచ్చాడు.

కానీ అందువల్లనే ఈ రోజు స్టార్ హీరో అయ్యానని కూడా చెప్పాడు.కానీ హిందీ లో మాలాగా ఎలాంటి బాధలు లేవు పైగా సల్మాన్ స్టార్ కాబట్టి పువ్వుల్లో పెట్టుకొని చూసుకున్న్నారు అని చెప్పుకోచ్చాడు.

అప్పటినుంచే ప్రేమపై నమ్మకం ఉంది.. సిద్దార్థ్ కు కాబోయే భార్య కామెంట్స్ వైరల్!