చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ మూవీలో సల్మాన్.. నార్త్ బాక్సాఫీస్ సైతం షేక్ కావడం పక్కా!
TeluguStop.com
టాలీవుడ్ పాన్ ఇండియా హీరో రామ్ చరణ్,( Ram Charan ) బుచ్చిబాబు( Buchibabu ) కాంబినేషన్ లో ఒక సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే.
ఇటీవల మైసూర్ లో తొలి షెడ్యూల్ కూడా ప్రారంభమైంది.ఆ షూటింగ్ లో హీరో రామ్ చరణ్ కూడా పాల్గొంటున్నారు.
ఇప్పటికే ఈ సినిమాపై అనేక రకాల వార్తలు కూడా వినిపించాయి.ఇకపోతే ఈ సినిమాలో ఒక బాలీవుడ్ స్టార్ కూడా వినిపించబోతున్నట్టు తెలుస్తోంది.
అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఆ పాత్రలో సల్మాన్ ఖాన్( Salman Khan ) నటించిన బోతున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
రామ్ చరణ్ తో సల్మాన్ కు మంచి అనుబంధం ఉంది.ఆ అనుబంధంతోనే చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో( God Father Movie ) నటించిన విషయం తెలిసిందే.
"""/" /
ఆ సినిమాకు అసలు పారితోషికమే తీసుకోలేదని అప్పట్లో చిరంజీవి( Chiranjeevi ) కూడా స్వయంగా తెలిపారు.
సల్మాన్ ఖాన్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా, చరణ్ ఆతిధ్యం ఇస్తుంటాడు.అలానే చరణ్ ముంబై ఎప్పుడు వెళ్లినా సల్మాన్ ని పలకరించి వస్తుంటాడు.
వీళ్ల మధ్య అంతటి అనుబంధం ఉంది.అయితే ఇప్పుడు అదే ఫ్రెండ్ షిప్ తో ఈ సినిమాలో నటించడానికి సల్మాన్ ఒప్పుకొంటాడని చిత్రబృందం గట్టిగా నమ్ముతోంది.
అదే జరిగితే ఒక క్రేజీ కాంబోని తెరపై చూసే అవకాశం దక్కుతుందని చెప్పాలి.
సంక్రాంతి లోగా ఈ కాంబోపై ఒక అధికారిక ప్రకటన రావచ్చని తెలుస్తోంది.కాగా ఈ చిత్రానికి పెద్ది( Peddi ) అనే టైటిల్ పరిశీలిస్తున్నారట.
"""/" /
నిజానికి ఇది ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు రాసుకొన్న కథ.కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఎన్టీఆర్ చేయలేకపోయాడు.
దాంతో చరణ్ దగ్గరకు వచ్చింది.ప్రీ ప్రొడక్షన్ కోసం బుచ్చిబాబు చాలా కాలం వెచ్చించాడు.
రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే.ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఒకవేళ ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ గనుక నటిస్తే చరణ్ కు బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ మరింత పెరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
మరి ఈ విషయంపై మూవీ మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.
రిలీజ్ రోజునే గేమ్ ఛేంజర్ హెచ్డీ ప్రింట్.. మూవీ ఇండస్ట్రీని ఈ దరిద్రం వదలదా?