మెగాస్టార్ కోసం సూపర్‌స్టార్.. మహేష్ కాదండోయ్!
TeluguStop.com
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాతో మరోసారి మెగాస్టార్ తనదైన మార్క్ వేసేందుకు రెడీ అవుతున్నాడు.స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు సరికొత్త అవతారంలో మనకు కనిపిస్తాడని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా తరువాత మెగాస్టార్ తన నెక్ట్స్ చిత్రాలను కూడా లైన్లో పెట్టే పనిలో పడ్డాడు.
ఇప్పటికే మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు చిరు రెడీ అవుతున్నాడు.
ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సొంతం చేసుకోవడంతో ఈ సినిమాలో చిరు నటించేందుకు రెడీ అయ్యాడు.
ఇక ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటించేందుకు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను సంప్రదించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
మలయాళంలో పృథ్వీరాజ్ పోషించిన పాత్రలో నటించేందుకు సల్మాన్ ఖాన్ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.
ఇలా చేయడంతో ఈ సినిమాకు పాన్ ఇండియా క్రేజ్‌ను తీసుకురావచ్చని వారు భావిస్తున్నారు.
మెగా ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉండే సల్మాన్ ఖాన్‌కు గతంలో చరణ్ డబ్బింగ్ చెప్పిన విషయం తెలిసిందే.
ప్రమలీల(ప్రేమ్ రతన్ ధన్ పాయో) సినిమాలో సల్మాన్‌కు చరణ్ డబ్బింగ్ ఇచ్చాడు.ఆ సమయంలో చరణ్‌తో సల్మాన్‌కు మంచి స్నేహం ఏర్పడింది.
దీంతో ఇప్పుడు లూసిఫర్ చిత్ర రీమేక్‌లో సల్మాన్‌ను తీసుకోవాలని చరణ్ భావిస్తున్నాడు.లాక్డౌన్ ముగిసిన వెంటనే సల్మాన్‌ను స్వయంగా కలిసి ఈ విషయంపై మాట్లాడాలని చరణ్ చూస్తున్నాడు.
మరి చిరు సినిమాలో సల్మాన్ నటిస్తాడా లేడా అనేది పక్కనబెడితే, ఈ కాంబో గనుక ఓకే అయితే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
అల్లరి మూకల దాడులు .. కిర్గిస్థాన్‌లోని భారతీయ విద్యార్ధులకు కేంద్రం హెచ్చరికలు