సల్మాన్ ఖాన్ సినిమాకు బడ్జెట్ ప్రాబ్లమ్.. అసలేం జరిగిందంటే?

బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

సల్మాన్ ఖాన్ ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు.ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కొత్త కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, మరోవైపు తాను నటించిన సినిమాలను విడుదల చేస్తున్నాడు.

అలా కెరీరపరంగా ఫుల్ జోష్ మీద ఉన్నారు సల్మాన్ ఖాన్.అయితే గతంలో సల్మాన్ ఖాన్ నటించిన హిట్ చిత్రం నో ఎంట్రీ.

ఈ కామెడీ ప్రాజెక్టుకు అనీస్ బజ్మీ దర్శకత్వం వహించగా బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరించారు.

అయితే ఈ మూవీ 2005లో విడుదలైంది.బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడంతో,నో ఎంట్రీ సినిమాకు సీక్వెల్‌‌ను ను పట్టాలెక్కించాలనుకున్నాడు.

అయితే ఈ సినిమా మాత్రం కొన్ని కారణాల వల్ల సినిమా షూటింగ్ వాయిదా పడుతూనే ఉంది.

ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికి ప్రాజెక్టు పట్టాలెక్కకపోవడంతో చిత్రాన్ని పక్కన పెట్టాలని సల్మాన్ నిర్ణయించుకున్నాడట మన కండల వీరుడు.

చట్టపరమైన కారణాలు అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులతో సినిమా చేయకూడదని సల్మాన్ ఖాన్ నిర్ణయించుకున్నట్టు బాలీవుడ్ మీడియా తెలుపుతోంది.

అయితే గత కొంత కాలంగా సల్మాన్ ఖాన్ నో ఎంట్రీ 2 సినిమాను చేయాలనుకుంటున్నాడు.

ఇదే విషయం పై అనీస్ బజ్మీతో కూర్చుని స్క్రిఫ్ట్‌ పై కూడా వర్క్ చేశాడు.

"""/"/ కానీ సహారా వన్ మోషన్ పిక్చర్స్ మూతపడటంతో మొదటి భాగం చట్టపరమైన ఇబ్బందుల్లో ఇరుక్కుంది.

అయితే ఈ వివాదాన్ని సులభంగా పరిష్కరించొచ్చని సల్లూ భాయ్ మొదట్లో భావించాడు.కానీ కేసు సులభంగా పరిష్కారమయ్యేలా కనిపించడం లేదు.

మొదటి భాగం రైట్స్ కావాలంటే మేకర్స్‌కు భారీగా చెల్లించాలట.ఈ మొత్తం అనుకున్న బడ్జెట్‌ను దాటి పోతుంది.

కామెడీ సినిమా చేయాలని అతడికి ఎంతో ఆసక్తి ఉన్నప్పటికి నో ఎంట్రీ 2 సినిమాకు పుల్‌స్టాప్ పెట్టేసినట్లు సల్మాన్‌తో సన్నిహితంగా మెలిగేవారు చెబుతున్నారు.

ఇదీ ప్రభాస్ రేంజ్.. అక్కడ 10 సినిమాలలో 6 ప్రభాస్ సినిమాలు మాత్రమే ఉన్నాయా?