కన్ఫం: చిరు సినిమాలో లేని సూపర్ స్టార్!
TeluguStop.com
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.
స్టార్ డైరక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చిరు సరికొత్త గెటప్‌లో మనకు కనిపిస్తాడని చిత్ర యూనిటో అంటోంది.
ఇక ఈ సినిమాలో చిరుతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ కేమియో పాత్రలో నటిస్తున్నాడని గతంలో వార్తలు వచ్చాయి.
కానీ అవేమీ నిజం కాదని చిత్ర యూనిట్ కొట్టిపారేసింది.కాగా తాజాగా ఆచార్య చిత్రంలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో నటిస్తాడని, దీనికి సంబంధించిన సంప్రదింపులు కూడా జరిగాయని వార్తలు వినిపిస్తున్నాయి.
గతంలో సల్మాన్ నటించిన రామ్‌లీలా చిత్రానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన వాయిస్‌ను డబ్బింగ్ ఇవ్వడంతో సల్మాన్‌కు మెగా ఫ్యామిలీతో మంచి బంధం ఏర్పడిందని, అందుకే ఈ సినిమాలో చిరు అడగ్గానే సల్మాన్ కేమియో చేసేందుకు ఒప్పుకున్నాడని వార్తలు వచ్చాయి.
కానీ ఇందులో కూడా ఏమాత్రం నిజం లేదని చిత్ర యూనిట్ తేల్చేసింది.ఈ సినిమలో సల్మాన్ ఖాన్ ఎలాంటి పాత్రలో నటించడం లేదని, అసలు తాము ఆయన్ను ఈ విషయమై సంప్రదించలేదని చిత్ర యూనిట్ తెలిపింది.
కాగా సల్మాన్ ఖాన్‌కు తన సినిమాలను పూర్తి చేసేందుకే సమయం సరిపోదని, అలాంటిది కేమియో పాత్రల్లో ఎలా నటిస్తారని పలువురు అంటున్నారు.
ఏదేమైనా ఇలాంటి గాలి వార్తలను వెంటనే ఖండిస్తే అవి వైరల్ అయ్యి తమకు తలనొప్పిని తీసుకురాకుండా చేయవచ్చిన చిత్ర యూనిట్ అంటోంది.
ఇక ఆచార్య సినిమా షూటింగ్‌ను లాక్డౌన్ తరువాత తిరిగి ప్రారంభించనున్నారు.కాగా ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది.
వైరల్ వీడియో: మరో కొత్త హెల్మెట్ మార్కెట్లోకి వచ్చేసింది గురూ.. వర్షాలకు ఈ హెల్మెట్టే కరెక్ట్..