ఫాం హౌస్ లో హీరోయిన్ తో సల్మాన్ ప్రేమాయణం… వైరల్ వీడియో
TeluguStop.com
లాక్ డౌన్ కారణంగా చాలా మంది ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు.బయటకి రాలేని పరిస్థతి నెలకొని ఉంది.
ఇక సల్మాన్ ఖాన్ కూడా లాక్ డౌన్ సమయంలో తన ఫాంహౌస్ కి వెళ్లి అక్కడ లాక్ అయిపోయాడు.
అది కూడా హీరోయిన్ జాక్వలిన్ ఫెర్నాండెజ్ తో ఉన్నాడు.ఇక అక్కడ ఖాళీ ఉండి ఏం చేయాలో తెలియక తన ఫాం హౌస్ ని లోకేషన్స్ గా మార్చుకొని ఆల్బమ్ సాంగ్స్ ని ప్లాన్ చేసి తన చానల్ ద్వారా రిలీజ్ చేస్తున్నాడు.
తాజాగా తేరా మినా అనే రొమాంటిక్ సాంగ్‌ను సల్మాన్ ఖాన్ రిలీజ్ చేసాడు.
ఈ పాటను పాడడంతో పాటు దీన్ని షూట్ చేసింది కూడా నేనే అంటూ సల్మాన్ చెప్పుకొచ్చాడు.
ఇక ఈ పాటకి మీ వెర్షన్‌లో షూట్ చేసి నాకు ట్యాగ్ చేయండి అంటూ ట్వీట్ చేసాడు.
ఇందులో సల్మాన్, జాక్వెలిన్ ప్రేమ ప్రయాణాన్ని చూపించారు.ఇందులో పూర్తి దర్శకత్వం ప్రతిభ అంతా సల్మాన్ ఖాన్ దే కావడం విశేషం.
ఇద్దరు బైక్‌పై జీపులో షికారు చేయడంతో పాటు కలిసి ఈత కొట్టడం ఈ పాటలో ఉంది.
అయితే అదంతా సల్మాన్ కల కన్నట్టు తెరకెక్కించారు.షబ్బరీ అహ్మద్ రాసిన ఈ పాటకు అజయ్ భాటియా సంగీతం అందించారు.
ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడతూ మేం ఫామ్‌హౌస్‌కు వచ్చిన ఏడు వారాలవుతోంది.
లాక్‌డౌన్ వల్ల ఇన్ని రోజులు ఒక్కచోటే ఉండిపోతామని అనుకోలేదు.అందుకే మమ్మల్ని మేము బిజీ చేసుకోవడానికి ఈ పాటను డిజైన్ చేసినట్టు తెలియజేశాడు.
ఫాంహౌస్ లో హీరోయిన్ తో సల్మాన్ కలిసి ఉంటున్నాడు అంటే అసలు ఏం జరుగుతుందో అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఈ వీడియోలో కనిపిస్తున్న విజువల్ అంతా రియల్ గా వాళ్ళ మధ్య జరుగుతున్నదే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
బీటౌన్ లో ఇప్పుడు వారి మధ్య ఏదో జరుగుతుంది అనే టాక్ వినిపిస్తున్న నేపధ్యంలో ఫాం హౌస్ ప్రేమాయణం వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కలబందతో హెయిర్ గ్రోత్ సీరం ఎలా తయారు చేసుకోవాలో తెలుసా..?