లక్ష్మి దేవిపై తన భక్తిభావం గురించి చెప్పిన హాలీవుడ్ హీరోయిన్

హిందూమతం అంటే కేవలం ఇండియాకి మాత్రమే పరిమితం అని అందరూ అనుకుంటారు.

అయితే ఇండియన్ కల్చర్, హిందూ దేవతలు, మత ఆచారాలు అనేవి చాలా దేశాలలో ప్రజలు నమ్ముతారు.

గౌరవిస్తారు.ఇండియాలో మాత్రం సనాతన ధర్మం, మతంలో, దేవుళ్ళ విషయంలో తప్పులని ఎత్తి చూపించడమే పనిగా పెట్టుకుంటూ ఉంటారు.

చాలా మంది హాలీవుడ్ సెలబ్రెటీలు సైతం ఇండియన్ దేవతలని బిలీవ్ చేస్తారు.ఆ నమ్మకంతో ఇండియా వచ్చినపుడు కచ్చితంగా ఆలయాలకి వెళ్లి దైవదర్శనం చేసుకుంటారు.

హిందూ దేవతలని ఆరాధించే నటులలో హాలీవుడ్ నటి సల్మా హయక్ కూడా ఉంది.

సల్మా హయక్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.డెస్పరాడో, వైల్డ్ వైల్డ్ వెస్ట్, ఫ్రిడా, స్పై కిడ్స్-3, ఒన్స్ అపాన్ టైమ్ ఇన్ మెక్సికో వంటి చిత్రాలతో సల్మా హయెక్ ఎంతో గుర్తింపు తెచ్చుకుంది.

మెక్సికో దేశానికి చెందిన సల్మా తాజాగా తన ట్వీట్ లో హిందూ దేవతలపై తన భక్తిభావాన్ని చూపించింది.

ఎప్పుడైతే నాలోని అంతర్గత సౌందర్యంతో సంధానం అవ్వాలనుకుంటానో, ఆ సమయంలో లక్ష్మీదేవి అమ్మవారిపై దృష్టి లగ్నం చేసి ధ్యానం చేస్తాను అంటూ సల్మా హయక్ ట్వీట్ చేశారు.

అంతేకాదు, లక్ష్మీదేవి అమ్మవారి ఫొటోను కూడా పంచుకున్నారు.ఈమె పెట్టిన పోస్ట్ కి ఇండియన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది.

అలాగే చాలా మంది విదేశీయులు కూడా ఆమె నమ్మకాన్ని అభినందిస్తూ కామెంట్స్ పెట్టారు.

ఇండియాలో అయితే హిందూయిజాన్ని అభిమానించే వాళ్ళు ఇక్కడ ఉన్న ఇతర మతాల వారు ఆమెని చూసి బుద్ధి తెచ్చుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.

హిందూ దేవతలపై ఆమెకి ఉన్న గౌరవాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలని పోస్టులు పెడుతున్నారు.

చిరంజీవి హిట్ సినిమాను రీమేక్ చేస్తున్న స్టార్ హీరో…