ఏళ్ళ పాటు మంచానికే పరిమితం అయినా సంగీత దర్శకుడు

తెలుగు చిత్ర పరిశ్రమలో అలనాటి ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వ‌ర‌రావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఆయన కొత్త శైలిలో సంగీతాన్ని సృష్టించారు.సాలూరు రాజేశ్వ‌ర‌రావు స్వ‌రాలు కూర్చిన 'ఇల్లాలు' (1940) చిత్రంలోని పాట‌లు అప్ప‌ట్లో కేవ‌లం తెలుగు ప్రాంతంలోనే కాకుండా మొత్తం ద‌క్షిణాదిలోనే సంచలనం సృష్టించింది.

అంతేకాక.మ‌ల్లీశ్వ‌రి, మిస్స‌మ్మ‌, ఇద్ద‌రు మిత్రులు, ఆరాధ‌న‌, డాక్ట‌ర్ చ‌క్ర‌వ‌ర్తి, రంగుల రాట్నం, పూల రంగ‌డు, మ‌నుషులంతా ఒక్క‌టే, కురుక్షేత్ర‌ము లాంటి సినిమాల‌కు ఆయ‌న స్వ‌రాలు కూర్చిన పాట‌ల‌ను ఎవరు మర్చిపోలేరు.

అయితే చివ‌రి రోజుల్లో ఆయ‌న బెడ్‌మీద ఏకంగా ఏడు సంవ‌త్స‌రాలు ఉన్నార‌నే విష‌యం ఇప్ప‌టి సంగీత ప్రియుల‌కు, గాయ‌నీ గాయ‌కుల‌కు, సంగీత ద‌ర్శ‌కుల‌కు చాలామందికి తెలియదు.

ఇక కృష్ణంరాజు సొంత సినిమా 'తాండ్ర పాపారాయుడు'కు ర‌స‌గుళిక‌ల్లాంటి పాట‌ల‌ను అందించిన సాలూరి, దాని త‌ర్వాత 'అయ్య‌ప్ప పూజాఫ‌లం' అనే చిత్రానికి ఓకే చెప్పారు.

అయితే ఆ సినిమా కోసం నాలుగు ప‌ద్యాలు, మూడు పాట‌లకు స్వ‌రాలు కూర్చారు ఆయన.

కాగా.ఎస్పీ బాలు, ఏసుదాస్‌, పి.

సుశీల‌తో పాట‌లు పాడించి రికార్డు చెప్పించారు.అయితే ఆ సినిమా ఆ పాట‌ల రికార్డింగ్‌ తోటే ఆగిపోయాయి.

"""/"/ కాగా.ఓ రోజు ఆయ‌న‌కు ఎక్కిళ్లు రావ‌డం మొద‌లై ఎంత‌కీ ఆగలేదంట.

ఇక వాళ్లింటి స‌మీపంలో ఉండే ఫ్యామిలీ డాక్ట‌ర్ విజ‌య్‌కుమార్‌ను పిలిచించి వైద్యం తీసుకున్నారు.

అయితే ఆయ‌న మందు ఇచ్చాక ఎక్కిళ్లు తగ్గిపోయంట.అంతేకాదు.

అనూహ్యంగా రాజేశ్వ‌ర‌రావు శ‌రీరంలో ఒక‌వైపు ప‌క్ష‌వాతం వచ్చింది.ఇక అప్పటి వరకు ఆయ‌న‌కు బీపీ కానీ, షుగ‌ర్ కానీ లేవు.

అయితే ఒక్క‌సారిగా హైబీపీతో పాటు సెరిబ్ర‌ల్ పెరాల‌సిస్‌కు గురైయ్యారు.దాని ఫ‌లితం.

ఏడేళ్లు మంచంమీదే ఉండిపోయారు ఆయన. """/"/ ఇక కొంత‌కాలం హాస్పిట‌ల్‌లో.

కొంత‌కాలం ఇంట్లో బెడ్ మీదే ఉండిపోయారు.ఆయనకీ టాబ్లెట్లు కూడా పొడిచేసి నోట్లో వేసేవారు ఇంట్లో వారు.

ఆయనకి ఐదుగురు కొడుకులు, ఐదుగురు కోడ‌ళ్లు రాజేశ్వ‌ర‌రావు ప‌సిబిడ్డ‌లాగా చూసుకున్నారంట .ఇక అలా బెడ్ మీద ఉండే మ‌న‌వ‌ళ్లు, మ‌న‌వ‌రాళ్ల‌తో ఆడుకుంటూ వ‌చ్చారు ఆయన.

ఇక చివరికి సాలూరు రాజేశ్వ‌ర‌రావు 1999 అక్టోబ‌ర్ 26న మృతి చెందారు.

నిజామాబాద్‌ జిల్లాకు బిజెపి, బిఅర్‌ఎస్‌ పార్టీలు చేసింది శూన్యం : ధర్మపురి సంజయ్