హనుమంతుని ఆలయానికి లక్షల విలువైన భూమిని విరాళంగా ఇచ్చిన ముస్లిం.. ఎక్కడంటే?
TeluguStop.com
మన దేశం మత సామరస్యానికి ప్రతీక అనే సంగతి తెలిసిందే.కుల మతాలతో సంబంధం లేకుండా మన దేశంలో మెజారిటీ ప్రజలు స్నేహపూర్వకంగా ఉంటారు.
తాజాగా మత సామరస్యాన్ని చాటి చెప్పే ఒక ఘటన నెట్టింట వైరల్ అవుతుండగా ఆ ఘటన హాట్ టాపిక్ అవుతోంది.
హైదరాబాద్ లోని మేడపల్లిలో( Medapalli ) తాజాగా హనుమంతుని ఆలయాన్ని ( Hanuman Temple )నిర్మించడంతో పాటు విగ్రహాన్ని, ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించడం జరిగింది.
ఈ దేవాలయం కోసం సలావుద్దీన్( Salahuddin ) అనే ముస్లిం వ్యక్తి లక్షల విలువ చేసే ఖరీదైన భూమిని విరాళంగా ఇచ్చారు.
మత సామరస్యాన్ని చాటుకున్న సలావుద్దీన్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
చిలుకూరు ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్ విగ్రహం, ధ్వజస్తంభం ప్రతిస్టంభన ( Rangarajan Statue, Flagpole Pratistambhana ) కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది.
"""/" /
సలావుద్దీన్ ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్ కు తన భూమికి సంబంధించిన పత్రాలను అందజేయడం జరిగింది.
సలావుద్దీన్ హనుమాన్ ఆలయం కోసం భూమి ఇవ్వడాన్ని రంగరాజన్ ప్రశంసించారు.తెలంగాణ రాష్ట్రం మత రాష్ట్ర పరిరక్షణలో ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శం అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
సలావుద్దీన్ మంచి మనస్సును చాటుకున్నారని నెటిజన్లు చెబుతున్నారు. """/" /
ప్రస్తుత కాలంలో చాలామంది తమ ఆస్తులను ఇతరులకు దానం చేయాలంటే వెనుకడుగు వేస్తారు.
ఎకరం లక్షల్లో పలుకుతున్న నేపథ్యంలో భూములను అమ్మడానికి సైతం చాలామంది ఆసక్తి చూపడం లేదు.
అయితే సలావుద్దీన్ మాత్రం గొప్ప మనస్సును చాటుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు.దేశంలోని దాదాపుగా అన్ని గ్రామాలలో హనుమంతుని ఆలయాలు ఉంటాయి.
హనుమంతుడిని పూజిస్తే మంచి జరుగుతుందని చాలామంది భక్తులు భావిస్తారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఆంజనేయ స్వామి ఆలయాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే.
కాసోవరి: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పక్షి.. మనిషిని కూడా చంపగలదు!