ఏడాదికి రూ.6.5 కోట్ల వేతనం.. ఉచితంగా ఇల్లు.. ఇతర సౌకర్యాలు
TeluguStop.com
మంచి ఉద్యోగం చేయాలని, చక్కగా స్థిరపడాలని అందరికీ ఉంటుంది.ఇంజినీరింగ్, మెడిసిన్, బిజినెస్ తదితర రంగాలలో డిగ్రీలు, పీజీలు చేసి ఉద్యోగాన్వేషణలో ఉంటారు.
భారీ జీతంతో కొలువులు అందుకుంటుంటారు.దీని కోసం చాలా ప్రయాస పడుతుంటారు.
అయితే విదేశాలలో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఆస్ట్రేలియాలోని ఓ పట్టణం గుడ్ న్యూస్ అందించింది.
మెడిసిన్ చేసిన వారికి భారీ వేతనంతో పాటు, ఇతర సౌకర్యాలను అందచేస్తోంది.ఏడాదికి రూ.
6.5 కోట్ల భారీ వేతనాన్ని ఆ పట్టణం ఆఫర్ చేస్తోంది.
దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. """/"/
పశ్చిమ ఆస్ట్రేలియాలోని క్వెరోడింగ్ అనే చిన్న పట్టణం ఉంది.
స్థానికంగా మెడికల్ ప్రాక్టీషనర్ లేరు.దీంతో ఇక్కడి అధికారులు భారీ జీతంతో ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తున్నారు.
5 కోట్ల వేతనం అందించనున్నారు.అంతేకాకుండా ఆ డాక్టరుకు ఉండడానికి నాలుగు బెడ్‌రూమ్‌ల ఇల్లు ఉచితంగా ఇస్తారు.
ఇక భారీ జీతం, ఇతర సౌకర్యాలు అందించడానికి చాలా కారణాలు ఉన్నాయి.చిన్న చిన్న పట్టణాలలో పని చేసేందుకు వైద్యులు ఇష్టపడడం లేదు.
దీంతో పట్టణాలలో డాక్టర్ల కొరత బాగా ఎక్కువగా ఉంది. """/"/
వైద్యులు లేకపోవడం, చికిత్సా సౌకర్యాల లోపంతో అక్కడ ఇబ్బందులు ఉన్నాయి.
ఆస్ట్రేలియా వైద్య విద్యార్థులలో 14 శాతం మాత్రమే ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారు.అందులోనూ చిన్న స్థాయి పట్టణాలలో పని చేయాలనుకునే వారి శాతం కేవలం 4.
5గా ఉంది.దీంతో క్రమంగా అక్కడ డాక్టర్ల కొరత ఏర్పడనుందనే అంచనాలు ఉన్నాయి.
దీంతో భారీ వేతనం, చక్కటి సౌకర్యాలతో పాటు కళ్లు చెదిరే బోనస్ కూడా అధికారులు ఆఫర్ చేస్తున్నారు.
రెండేళ్లు ఏదైనా పట్టణంలో వైద్యులు పని చేస్తే 12 వేల ఆస్ట్రేలియన్ డాలర్లను అందించనున్నారు.
94 లక్షలు.ఇక ఐదేళ్లు ఒకే పట్టణంలో పని చేస్తే 23 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.
19.05 లక్షలు) బోనస్ అందిస్తారు.
ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరిగిన 76వ రిపబ్లిక్ డే వేడుకలు .. భారీగా హాజరైన ఎన్ఆర్ఐలు