ఆల్ టైం రికార్డ్ సెట్ చేసిన డార్లింగ్.. ‘సలార్’ టీజర్ తో అన్ని గల్లంతు!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) మరో బిగ్గెస్ట్ రికార్డ్ నెలకొల్పాడు.

టాలీవుడ్ లో మరే హీరో బీట్ చేయలేని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

ప్రభాస్ చేస్తున్న 'సలార్' మూవీ( Salaar ) నుండి నిన్న టీజర్ వచ్చిన విషయం తెలిసిందే.

ఈ టీజర్ కోసం ఎన్నో రోజులుగా డార్లింగ్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియెన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

"""/" / ఎట్టకేలకు ఈ టీజర్ ను నిన్న రిలీజ్ చేయగా అద్భుతమైన స్పందన లభించింది.

ఈ టీజర్ లో ప్రభాస్ విజువల్స్ లేకపోయిన ఈ టీజర్ ఇంటర్నెట్ ను షేక్ చేసింది.

మాస్ విజువల్స్ అండ్ ఎలివేషన్ తో పవర్ఫుల్ గా నీల్ టీజర్ ను కట్ చేసాడు.

నీల్( Prashanth Neel ) టీజర్ కట్ చూసిన తర్వాత ఈ సినిమా 1000 కోట్లు ఖాయం అంటున్నారు.

ఇక టీజర్ రిలీజ్ అయ్యి 24 గంటలు గడిచింది.మరి ఈ 24 గంటల్లోనే ప్రభాస్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు.

24 గంటల్లోనే ఈ టీజర్ 83 మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేసింది.

దీంతో బిగ్గెస్ట్ రికార్డ్ ఇదే అని చెప్పాలి.ఇప్పటి వరకు సింగిల్ ఛానెల్లో ఏ టీజర్ కూడా ఇన్ని మిలియన్ వ్యూస్ అందుకోలేదు.

గతంలో నీల్ తెరకెక్కించిన కెజిఎఫ్ టీజర్ 78 మిలియన్ వ్యూస్ అందుకుని టాప్ లో ఉండగా ఇప్పుడు ఈ రికార్డ్ ను క్రాస్ చేసి సరికొత్త రికార్డును ప్రభాస్ తన ఖాతాలో వేసుకున్నాడు.

"""/" / దీంతో సలార్ టీజర్ మ్యానియా ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

కాగా ఈ సినిమాలో శృతి హాసన్( Shruti Haasan ) హీరోయిన్ గా నటిస్తుండగా.

హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.సెప్టెంబర్ 28న ఈ మూవీ గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.

మరి అప్పుడు ఇంకెన్ని రికార్డులను నెలకొల్పుతుందో వేచి చూడాలి.