సలార్ పార్ట్1 కథ ఇదే.. ఆర్మీతో ప్రభాస్ యుద్ధం చేస్తే మామూలుగా ఉండదంటూ?

టాలీవుడ్( Tollywood ) పాన్ ఇండియా హీరో ప్రభాస్ ( Prabhas )ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

ఒక సినిమా ఇంకా తెరకెక్కకముందే మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నారు ప్రభాస్.

అయితే ప్రభాస్ ఇప్పటివరకు నటించిన రాధేశ్యామ్, ఆదిపురుష్, సాహో లాంటి సినిమాలు అన్ని డిజాస్టర్ కావడంతో అభిమానులు అంచనాలు అన్నీ కూడా తదుపరి సినిమా సలార్ పై పెట్టుకున్నారు.

తాజాగా ఈ మూవీ టీజర్‌ విడుదలైన విషయం తెలిసిందే.ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది రెండు పార్ట్ లుగా రాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన మొదటి పార్ట్ యుద్ధ విరమణ టీజర్‌ గూస్‌బంమ్స్ తెప్పించేలా ఉంది.

ప్రభాస్‌ ఊచకోత అదిరిపోయింది. """/" / అయితే టీజర్ లో ప్రభాస్‌ని సరిగా చూపించలేదనే కామెంట్స్ వచ్చాయి.

ఫ్యాన్స్ డిజప్పాయింట్‌ అయినట్టు ఆవేదన చెందారు.కానీ టీజర్‌ మాత్రం రికార్డు వ్యూస్‌ సాధించింది.

ఇది ఒక్క రోజులో ఇది 83 మిలియన్స్ వ్యూస్‌ని( 83 Million Views ) సాధించి సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేసింది.

అయితే ఈ రికార్డుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది.ఈ నేపథ్యంలో సలార్‌ సినిమాకి సంబంధించిన ఒక షాకింగ్‌ విషయం సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ లీక్‌ అయ్యింది అనే చర్చ జోరుగా కొనసాగుతోంది.

సలార్‌ ( Salar ) స్టోరీ ఇదే అని రూమర్స్ వైరల్‌ అవుతున్నాయి.

ఆ రూమర్స్ ప్రకారం ఈ మూవీ స్టోరీ మొత్తం 1980లో జరుగుతుందట.సున్నపు రాయి మాఫియా నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందట.

ఈ సున్నపు రాయి ఫార్మాకి, యూఎస్‌ ఆర్మీకి లింక్‌ ఉంటుందట.ఈ క్రమంలో సలార్‌ యూఎస్‌ ఆర్మీతో పోరాడాల్సి వస్తుందని తెలుస్తోంది.

"""/" / సినిమాలో కొన్ని యాక్షన సీన్లు విదేశాల్లోనూ సాగుతాయని, అందుకోసం ఇటలీలో చిత్రీకరించినట్టు సమాచారం.

ఆయా ఎపిసోడ్‌లు సినిమాకి హైలైట్‌గా ఉంటాయని సమాచారం.అలాగే ఈ కథకి కేజీఎఫ్‌2 సినిమా( KGF2 Movie ) కథకి సంబంధం ఉంటుందట.

ఒక చోట కేజీఎఫ్‌2 నుంచి లింక్‌ ఉంటుందని, ప్రశాంత్‌ నీల్ యూనివర్స్ లో భాగమే సలార్‌ అని తెలుస్తోంది.

మరి ఇందులో నిజా నిజాలు తెలియాల్సి ఉంది.ఈ సినిమా కొత్త రికార్డులు సృష్టిస్తుంది అని ప్రభాస్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇక తాజాగా విడుదల అయిన టీజర్‌ కాస్త డిజప్పాయింట్‌ చేసినా రికార్డ్ వ్యూస్‌ సాధిస్తుంది.

ఇక ట్రైలర్‌ ఎన్ని సంచలనాలకు కేరాఫ్‌గా నిలుస్తుందో అనే ఉత్సాహం ప్రభాస్‌ అభిమానుల్లో కనిపిస్తుంది.

కాగా దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందిన విషయం తెలిసిందే.

ఇది ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్‌ 28న విడుదల కాబోతుంది.

వైఫ్ కోసమే డైలీ 320 కి.మీ ప్రయాణిస్తున్న చైనీస్ వ్యక్తి..!